Begin typing your search above and press return to search.
2 గంటల్లో మినీ ఆస్పత్రి.. మద్రాస్ ఐఐటీ ఘనత
By: Tupaki Desk | 18 July 2020 12:30 AM GMTకేవలం రెండు గంటలు.. ఒక మినీ ఆస్పత్రిని ఏర్పాటు చేయవచ్చా? అంటే అసాధ్యమని ఎవరైనా చెప్తారు. కనీసం ఆరు నెలలు పడుతుందంటారు. కానీ మద్రాస్ ఐఐటీ లోని స్టార్టప్ కంపెనీ ‘మోడ్యులస్ హౌసింగ్’ చేసి చూపించింది. కేవలం 2 గంటల్లో మినీ ఆస్పత్రిని కట్టి ఔరా అనిపించింది.
స్టార్టప్ కంపెనీ ‘మోడ్యులస్ హౌసింగ్’... మోడ్యులస్ పేరిట కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీతో 15 పడకలతోపాటు ఒక ఐసీయూ, ఒక వైద్యుడి గదిని నలుగురు వ్యక్తులు కలిసి రెండు గంటల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాంటి కరోనా టైంలో మారుమూల ఎక్కడ? ఏ చోట అయినా కేవలం రెండు గంటల్లో బాధితుల సంఖ్య పెరిగితే వైద్య సేవలందించేందుకు ఆస్పత్రి కట్టవచ్చని నిరూపించారు. దేశవ్యాప్తంగా ఈ కరోనా టైంలో మినీ ఆస్పత్రి మేలైన మార్గమని అంటున్నారు.
2018లో ఇద్దరు మద్రాస్ ఐఐటీ పట్టభద్రులు కలిసి మోడ్యులస్ హౌసింగ్ కంపెనీ స్థాపించారు. వారు తాజాగా కేరళలోని వైనాడ్ జిల్లాలో మినీ ఆస్పత్రిని రెండుగంటల్లో కట్టేశారు. ముందుగానే నిర్మించిన గోడలు, కిటీకీల్లాంటి భాగాలతో గృహ నిర్మాణాన్ని చౌకగా మార్చడం ఈ కంపెనీ ఉద్దేశం. ఇక దీన్ని విప్పి లారీలో దాదాపు ఆరు మినీ ఆస్పత్రుల సామగ్రిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మళ్లీ ఏర్పాటు చేయవచ్చు. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈ కొత్త టెక్నాలజీ కరోనా వేళ అందరికీ వరమవుతోంది.