Begin typing your search above and press return to search.
ఆరేళ్ల తర్వాత ఆ సిటీలో గంటకు జీతం వెయ్యి!
By: Tupaki Desk | 1 April 2016 9:05 AM GMTరోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా రూ.300 వేతనం రావటం గగనమే. అలాంటిది ఒక గంట పని చేస్తే వెయ్యి రూపాయిల వేతనం లభించటం అంటే మాటలా? పెద్ద పెద్ద ఉద్యోగులకు సాధ్యమేమో కానీ.. సాదాసీదా పనులకు అంతేసి జీతాలా? అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకుంటే.. అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో పని చేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అది కూడా ఎంతలా అంటే.. గంటకు వెయ్యి రూపాయిల (కచ్ఛితంగా చెప్పాలంటూ ఓ ఆరేడు రూపాయిలు తక్కువగా) చొప్పున.
ప్రస్తుతం కాలిఫోర్నియా నగరంలో పని చేసే వారికి గంటకు పది డాలర్లు చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. కానీ.. మరో ఆరేళ్ల తర్వాత నుంచి జీతాలు ఏ రేంజ్ లో ఉండాలన్న విషయంపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 2022 నుంచి ఆ సిటీలో గంటకు 15 డాలర్లు చొప్పున జీతం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే.. మన రూపాయిల్లో లెక్కేస్తే.. దాదాపు రూ.994లుగా తేలుతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభలో ఆమోదించారు. ఈ నేపథ్యంలో మరో ఆరేళ్లలో కాలిఫోర్నియా నగరంలో గంటకు కనీసం వేతనం రూ.వెయ్యి అన్న మాట. రోజుకో పది గంటలు కష్టపడితే.. డబ్బులే డబ్బులు అనిపిస్తుంది కదూ..?