Begin typing your search above and press return to search.
నాగమౌనిక...భూమా లేని లోటును తీర్చేసిందే!
By: Tupaki Desk | 24 Aug 2017 5:39 AM GMTదివంగత ఎమ్మెల్యే - సీనియర్ రాజకీయ వేత్త భూమా నాగిరెడ్డి... పరిచయం అక్కర్లేని పేరే. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అడ్డాగా రాజకీయాలు నడిపిన రాజకీయ నేతగా అయన అందరికీ చిరపరచితులు. నంద్యాల ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ఆళ్లగడ్డ నేతగానే జనం మదిలో గుర్తుండిపోతారు. ఎందుకంటే... నంద్యాల ఎంపీగా ఉన్నా కూడా ఆయన నిత్యం ఆళ్లగడ్డ కేంద్రంగానే రాజకీయాలు నెరిపారు. అంతేకాకుండా ఆళ్లగడ్డ తరహా రాజకీయాలనే కొనసాగించిన భూమా నాగిరెడ్డితో మాట్లాడాలంటేనే... చాలా మంది రాజకీయ నాయకులతో పాటు అధికార యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోయేవారట.
ఇక భూమా ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయాలంటే కాంట్రాక్టర్లకు కత్తి మీద సాములాంటి వ్యవహారమేనని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో భూమా నాగిరెడ్డి ఓ కాంట్రాక్టరును బెదిరిస్తూ సోషల్ మీడియాలోకి వచ్చేసిన ఓ వీడియా భూమా గూండాగిరీ జనానికి కళ్లకు కట్టిందనే చెప్పాలి. *నా అనుమతి లేకుండా నా ప్రాంతంలో ఎలా పనిచేస్తావో చూస్తా* అంటూ భూమా జారీ చేసిన హెచ్చరికతో సదరు కాంట్రాక్టరు బెంబేలెత్తిన వైనం నాడు పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. కర్నూలు- కడప జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యానికి కారణం భూమానేనన్న వాదన కూడా లేకపోలేదు.
ఇదంతా గతమైతే... భూమా మరణించినా, ఆయన తరహా రాజకీయాలు మాత్రం కనుమరుగు కాలేదు. భూమా సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఆయన స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే... భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి - కుమార్తెలు అఖిలప్రియ - నాగమౌనికలు వెన్నుదన్నుగా నిలిచారు. నిన్న నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ లో బ్రహ్మానందరెడ్డి పెద్దగా కనిపించలేదు గానీ... మిగిలిన ముగ్గురు మాత్రం హల్ చల్ చేశారనే చెప్పాలి. మంత్రి హోదాలో ఉన్న అఖిలప్రియ కాస్తంత స్పీడు తగ్గించినా... జగత్ విఖ్యాత్ తో పాటు నాగ మౌనికలు మాత్రం తమ తండ్రి భూమా నాగిరెడ్ది తరహాలోనే చక్రం తిప్పారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. జగత్ విఖ్యాత్ వైసీపీ శ్రేణులపై దూసుకొచ్చే క్రమంలో అతడి ఆగ్రహావేశాలతో కూడిన వైఖరి నిజంగానే వివాదాస్పదమైంది.
ఇక నాగమౌనిక... తాను తన తండ్రికేమీ తీసిపోయేది లేదని తేల్చి చెప్పేశారు. మీరు అరెస్ట్ చేస్తారా? మా వాళ్లతో సెటిల్ చేయించమంటారా? అంటూ నాగమౌనిక పోలీసులతో అన్న మాటలు ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేపాయి. యువతి అయినప్పటికి కూడా నాగమౌనికలో ఏమాత్రం బెరుకు లేదని, తన తండ్రి ఏ స్థాయిలో బెదిరింపులకు దిగేవారో... అంతకంటే కూడా మించిన స్థాయిలో నాగమౌనిక ప్రవర్తించారనే చెప్పాలి. పోలింగ్ బూత్ లోని అనుచరులను వెంటేసుకుని వెళ్లిన నాగమౌనిక... అక్కడి వైసీపీ ఏజెంట్‌ను టార్గెట్ చేస్తూ నాగమౌనిక నానా యాగీ చేశారు. అచ్చూ తన తండ్రి వాడే లాంగ్వేజ్ నే వాడిన నాగమౌనికను సముదాయించేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చిందట. *వాడిని అరెస్ట్ చేయండి. మీకు చేతకాకపోతే మా వాళ్లతో సెటిల్ చేయిస్తా*, *వాడిని పట్టుకోండిరా*, *వాడిని అరెస్ట్ చేయకపోతే నా వాళ్లకు నేను సమాధానం చెప్పలేను. తక్షణమే అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి* అని నాగమౌనిక బహిరంగంగా పోలీసులతో అన్న మాటలు విన్న అక్కడి పోలింగ్ సిబ్బంది షాక్ తిన్నారట.