Begin typing your search above and press return to search.
మంత్రి ఆళ్ల నాని ఔట్.. ఆ స్థానంలో ఎంట్రీ ఇస్తున్నదెవరో క్లారిటీ వచ్చేసిందట
By: Tupaki Desk | 13 March 2022 1:30 AM GMTగడిచిన కొద్ది నెలలుగా సాగుతున్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన చర్చ.. ఈ మధ్యన తగ్గిన సంగతి తెలిసిందే. ఏ రోజున కొత్త కేబినెట్ ను కొలువుతీరుస్తారన్న టెన్షన్ వైసీపీ మంత్రుల్ని పట్టి పీడిస్తోంది. అయితే.. ఈ అంశంపై సీఎం జగన్ క్లారిటీ ఇవ్వని నేపథ్యంలోఅసలు కొత్త టీం వస్తుందా? రాదా? అన్న సందేహం వెంటాడేది. అలాంటిది మంత్రి బాలినేని పుణ్యమా అని.. ఆ ఇష్యూ ఇప్పుడు మళ్లీ లైవ్ లోకి వచ్చింది.
శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో.. ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న బుగ్గనను తాను సూట్ చేసుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టాలని కోరానని.. వచ్చే ఏడాదికి ఆయన ఉండకపోవచ్చు కదా? అన్న మాటను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద అనటం.. దానికి ఆయన స్పందిస్తూ.. మీరెందుకు ఎప్పుడూ ఇదే ఆలోచిస్తారు? అన్న మాటతో పాటు.. కొత్త కేబినెట్ ఇప్పుడేకాదని మరికొంత సమయం ఉందని చెప్పటం తెలిసిందే. సామాజిక సమీకరణల నేపథ్యంలో మొదట్లో చెప్పినట్లు కాకుండా.. కొంతమంది మంత్రుల్ని ఉంచి.. మిగిలిన మంత్రుల్ని పార్టీ సేవకు వినియోగిస్తారని చెప్పారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. పార్టీకి సేవ చేయటంలో సక్సెస్ అయిన వారికి తమ తర్వాతి ప్రభుత్వంలో మంత్రులుగా తిరిగి నియమిస్తామన్న మాటను చెప్పారు. దీంతో.. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి ఎలా ఉంటుందన్న దానిపై ఒక స్పష్టత వచ్చినట్లుగా చెప్పాలి.
ఇదిలా ఉంటే.. మంత్రి పదవి నుంచి తొలగించి.. పార్టీ పార్టీపదవిని అప్పగించే వారి విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నానిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆళ్ల నానిని మంత్రి పదవి నుంచి తొలగించి.. ఆయనకు జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ఆయన స్థానంలో గత ఎన్నికల్లో జెయింట్ కిల్లర్ గా పేరు పొందిన భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మంత్రి వర్గంలో తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తొలుత కాంగ్రెస్.. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ప్రజారాజ్యం పార్టీలో చేరటం.. టికెట్ రాకపోవటంతో పోటీకి దూరంగా ఉండటంతో ఆయన బరిలోకి దిగలేదు.
2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయన ఆ తర్వాతి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరి ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందర్భంలో ఆయన్ను ఓడించటం ద్వారా.. జెయింట్ కిల్లర్ గా అవతరించారు. వివిధ రకాల సమీకరణాలతోఅప్పట్లో మంత్రివర్గంలో చోటు లభించని ఆయనకు తాజాగా మాత్రం ఖాయంగా మంత్రి వర్గంలో బెర్తు గ్యారెంటీ అంటున్నారు. మరి.. ఈ అంచనాలో నిజం ఎంతన్నది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంటుంది.