Begin typing your search above and press return to search.
బాబు గేటు గుట్టు విప్పిన మంత్రి అనిల్!
By: Tupaki Desk | 17 July 2019 9:42 AM GMTబాబు జమానాలో దోపిడీ ఎంత జరిగిందన్న విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ రోజు అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి. బాబు హయాంలో నిధుల వృధా ఎంత భారీగా సాగిందన్న విషయాన్ని ఆయన ఉదాహరణలతో చెప్పి షాకిచ్చారు. విపక్షం నోట మాట రాకుండా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అవకతవకలనుపలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా.. మంత్రి రియాక్ట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు అంచనాల్ని భారీగా పెంచేసిన వైనాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గాలేరు నగరి ప్రాజెక్టు ప్యాకేజీ29లో రూ.171 కోట్ల పని అయితే.. అప్పటికి రూ.166 కోట్ల పని జరిగిందని.. మిగిలిన రూ.5 కోట్ల పనికి బాబు సర్కారు దాన్ని ఏకంగా రూ.137 కోట్లకు పెంచేశారని చెప్పారు.
బాబు హయాంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని.. ఒక గేటును ప్రారంభించటం కోసం ఇచ్చిన ప్రకటనల విలువ ఏకంగా రూ.2.30 కోట్లు ఉండటాన్ని ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గేటు పనులు పూర్తి కాక ముందే గేటు ప్రారంభ ప్రకటన కోసం ప్రజాధనాన్ని విపరీతంగా దుబారా చేశారన్నారు.
ప్రాజెక్టులలో అవినీతి.. అక్రమాలు జరగకుండా ఉండేందుకు రివర్స్ టెండరింగ్ ద్వారా అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండటానికి వీలుగా టెండర్ల విధానాన్ని తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం శిలాఫలకాలు తప్పించి.. ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. బాబు హయాంలో సాగిన ప్రాజెక్టు దుబారాను ప్రస్తావిస్తే.. అధికారపక్షానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్ని తమకు చెందిన వారికే కేటాయించుకున్నారన్నారు.