Begin typing your search above and press return to search.
మంత్రి అనిల్ దూకుడుకు సోమిరెడ్డి కళ్లెం వేస్తారా? చేతులెత్తేస్తారా?
By: Tupaki Desk | 19 Feb 2021 5:03 PM GMTమంత్రి అనిల్ కుమార్ దూకుడు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీకి నెల్లూరులో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకుల కంటే కూడా.. యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఉన్నారు. ఆయన దూకుడుతో పార్టీ ఇక్కడ ఒక వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. గత ఎన్నికల్లోనూ అనిల్ దూకుడుగా వ్యవహరించా రు. ఆయన దూకుడుతోనే వైసీపీ తొలిసారి ఇక్కడ పాగా వేసింది. అయితే.. మేయర్ అజీజ్ తర్వాత కాలంలో టీడీపీలోకి జంప్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ ఇప్పటికీ.. పుంజుకోలేక పోతోంది.
నెల్లూరు సిటీ - రూరల్ ప్రాంతాల్లో వైసీపీ నాయకులే విజయం సాధించారు. మరీ ముఖ్యంగా మంత్రి అనిల్ కు తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పాగా వేస్తుందా? అనేది కీలక ప్రశ్న. పైగా ఇక్కడి బాధ్యతలను సీనియర్ నాయకుడు - పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు అప్పగించారు. అయితే.. ఆయన సౌమ్యుడు - వివాదాలకు దూరంగా ఉంటారనే పేరున్నా.. దూకుడు రాజకీయాలు చేయడంలోనూ ఆయన వెనుకబడ్డారు. ఇప్పటికే ఐదుసార్లు తనసొంత నియోజకవర్గంలోనే ఆయన ఓడిపోయారు. అలాంటి నేత.. ఇప్పుడు కార్పొరేషన్ లో సైకిల్ ను పరుగులు పెట్టిస్తారనే ఆశలు చంద్రబాబుకు ఆశలు ఉన్నా.. స్థానిక కేడర్‌కు మాత్రం లేక పోవడం గమనార్హం.
సోమిరెడ్డి వెంట నడిచేందుకు నాయకులు రెడీ గా లేరని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి సిటీలో మాజీ మంత్రి పొంగూరి నారాయణ ఉన్నారు. అదేవిధంగా మాజీ మేయర్ అజీజ్ కు కూడా పట్టుంది. అయితే.. వీరిని కాదని.. సోమిరెడ్డిని తెచ్చిపెట్టారు. దీంతో అజీజ్ షాక్ కు గురయ్యారని టాక్ వస్తోంది. తనకు బాద్యతలు అప్పగించాలని.. కార్పొరేషన్ ను గెలిపించే బాధ్యత తను చూస్తానని అజీజ్ ఇప్పటికే చంద్రబాబుకు విన్నవించారు. అయితే.. బాబు మాత్రం సోమిరెడ్డి పైనే నమ్మకం పెట్టుకున్నారు. పోనీ.. మాజీ మంత్రి దూకుడుగా ఉన్నారా? అంటే.. ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అజీజ్ కూడా తన మానాన తను వ్యవహరిస్తే.. పరిస్థితి టీడీపీకి వ్యతిరేకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.