Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడు మాట‌లు వింటున్నారా బాబు?

By:  Tupaki Desk   |   29 Jan 2019 6:36 AM GMT
అచ్చెన్నాయుడు మాట‌లు వింటున్నారా బాబు?
X
అదే ప‌నిగా తిడుతూ.. క‌డుపు నిండా పెట్టినా దాంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆ చిన్న విష‌యం ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి తెలీదా? అన్న‌ది ఇప్పుడు పెద్ద డౌట్ గా మారింది. ప్ర‌జాజీవితంలో ఉన్న వారు ఎలా మాట్లాడాల‌న్న విష‌యాన్ని కూడా అచ్చెన్న లాంటోళ్ల‌కు తెలియ‌జేయాలా? అన్న సందేహం క‌లిగేలా ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయి.

క‌ల‌లో కూడా ఊహించ‌లేని విధంగా.. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారులపై అచ్చెన్న చేస్తున్న వ్యాఖ్య‌లు వింటే ఒక‌ప‌ట్టాన జీర్ణించుకోవ‌టం క‌ష్టం. ఉప్పు.. కారం తినేటోళ్లు అయితే.. అచ్చెన్న మాట‌ల‌కు తీవ్రంగా హ‌ర్ట్ కావ‌టం ఖాయం. ఇంత‌కీ అచ్చెన్న నోటి నుంచి వ‌చ్చిన ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్య‌ల్ని చూస్తే..

ఏంరా.. వంద యూనిట్లు ఫ్రీగా తీసుకొన్నావ్‌. మీ ఆవిడ ప‌దివేలు దొబ్బంది. రుణ‌మాఫీ వ‌స్తే దొబ్బారు. ఇవ‌న్నీ దొబ్బి.. మన‌కు ఓట్లు వేయ‌కుంటే ఊరుకునేది లేదు.. నిల‌దీయండి అంటూ త‌న అనుచ‌రుల వ‌ద్ద చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఎంత మంత్రి అయితే మాత్రం.. అలా నోరు పారేసుకుంటారా? అయినా.. ప్ర‌జ‌లు ఎవ‌రైనా అదే ప‌నిగా త‌మ‌కు ఫ‌లానా సాయం కావాల‌ని అడిగారా ఏంటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లతో గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌తో మాట్లాడాల్సిన రాష్ట్ర మంత్రి అందుకు భిన్నంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వ‌తుఓంది. ఎంత డ‌బ్బులు ఉంటే చాలు.. స్వేచ్ఛ‌ను తాక‌ట్టు పెట్టుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. శ్రీ‌కాకుళం జిల్లా కోట‌బొమ్మాళి మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా కొంద‌రు నేత‌ల వ‌ద్ద మంత్రి ఈ తీరులో వ్యాఖ్యానించ‌టం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. అధికార ప‌క్ష నేత‌లు ఈ త‌ర‌హాలో నోరు పారేసుకుంటే.. బాబుకు షాకింగ్ రిజ‌ల్ట్ రావ‌టం ఖాయమంటున్నారు. ఏంది అచ్చెన్నా.. బాబును ఏం చేయాల‌నుకుంటున్నారు?