Begin typing your search above and press return to search.
బాబు పై చెప్పులు విసిరితే..వైశ్రాయ్ సంఘటన గుర్తొచ్చింది!
By: Tupaki Desk | 12 Dec 2019 9:17 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య జరుగుతున్నాయి. సభ ప్రారంభమైనప్పటి నుండి వైసీపీ -టీడీపీ నేతల విమర్శలు - ఆరోపణలతోనే ఉన్న కాసింత పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ రోజు ఉదయం చంద్రబాబు నన్ను మార్షల్ తోసేశారు అంటూ వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన చంద్రబాబు వ్యవహార శైలిని దుయ్యబట్టారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నపుడు ఆయన శైలి ఒకలా ఉండేదని - ఆయన చనిపోయాక రాష్ట్రంలో తానొక్కడినే లీడర్ అనుకున్నారని ఎద్దేవా చేశారు. నేను వైసీపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడానని.. ఆ సందర్భంలో తాను మంత్రిని కూడా అవుతానని చెప్పగా.. నువ్వు వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు.
అయితే.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిందని - నేను మంత్రిని కూడా అయ్యాయని చంద్రబాబు ముందే స్పీకర్ కు తెలిపారు ఇక - హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అవంతి అన్నారు. అలాగే తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటన గురించి మాట్లాడిన మంత్రి పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు రాజధానిలో పర్యటించినప్పుడు చెప్పులు వేశారని.. తనకు గతంలో జరిగిన వైశ్రాయ్ సంఘటన గుర్తుకి వచ్చింది అని చెప్పారు.