Begin typing your search above and press return to search.
బాబు సిద్ధాంతం: తెలంగాణ లో ఫ్లాప్.. ఇప్పుడు ఆంధ్రా లో
By: Tupaki Desk | 27 Dec 2019 7:12 AM GMTతెలంగాణ ఉద్యమం సందర్భం గా రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు విసిరిన పాచిక ఎంత పాపులర్ అయ్యిందో మనం చూశాం.. తెలంగాణను వ్యతిరేకించకుండా ఆంధ్రాను కాదనకుండా బాబు గారు ప్రవేశ పెట్టిన ఈ సిద్ధాంతం ఇప్పుడు మళ్లీ ఆయనకు అవసరమైంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తో మరోసారి రెండు కళ్ల సిద్ధాంతం అంటున్నారు.
తాజాగా మూడు రాజధానుల పై ఎలాంటి ఎజెండా లేకుండా రాజధాని పేరు తో చంద్రబాబు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండి పడ్డారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజధాని రైతులు, ప్రజలు భయపడాల్సిన అవసరంలేదని జగన్ రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేస్తారని మంత్రి అవంతి భరోసానిచ్చారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.
రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ లో చంద్రబాబు నష్ట పోయారని..అయినా మేల్కోలేదని.. మళ్లీ ఏపీలో రాజధాని పేరుతో చంద్రబాబు అదే సిద్ధాంతం తీసుకొచ్చి విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి పై నాడు చంద్రబాబు సీమ, ఉత్తరాంధ్ర వాసుల తో చర్చించలేదని.. ఐదేళ్లలో రాజధాని కట్టకుండా తాత్కాలిక రాజధాని తో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగన్ అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని భరోసానిచ్చారు.