Begin typing your search above and press return to search.
గంటా వర్సెస్ అవంతి...విశాఖ కబ్జాలపై ఇంకో సిట్ రెడీ
By: Tupaki Desk | 7 Sep 2019 9:36 AM GMTటీడీపీ హయాంలో విశాఖ నగరంతో పాటు విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకున్న కుంభకోణాలపై మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు కానుంది. ఈ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ - మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న రాజకీయ వైరంలో భాగంగానే ఈ రెండో సిట్ రంగంలోకి దిగనున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ హాయాంలోనే ఈ కుంభకోణాలపై ఓ సిట్ ఏర్పాటైనా... ఆ సిట్ నివేదిక బయటకు రాలేదు. ఈ క్రమంలో సదరు సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని - లేదంటే కొత్త సిట్ వేసి పునర్విచారణ చేసి బాధ్యులను తేల్చాలని గంటా నిన్న ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ లేఖపై జగన్ కేబినెట్ లోని కీలక మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి నిజాలను నిగ్గు తేల్చేందుకు తమ ప్రభుత్వం తప్పనిసరిగా సిట్ ను ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తమ విచారణలో సెంటు భూమిని కబ్జా చేసినట్లు తేలినా కఠిన చర్యలే ఉంటాయని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లాలో భూములను కాజేసిన ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదన్న రీతిలో స్పందించిన అవంతి... దోషులకు కఠిన దండనలు తప్పవని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే... టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై అప్పుడే చంద్రబాబు కేబినెట్ ఓ సిట్ వేసిన విషయాన్ని కూడా అవంతి ప్రస్తావించారు. బాబు సర్కారు నియమించిన సిట్ దర్యాప్తు పూర్తి చేసిందని - నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించిందని కూడా గుర్తు చేశారు. మరి ప్రభుత్వానికి చేరిన సదరు నివేదికను టీడీపీ పెద్దలు ఎందుకు బహిర్గతం చేయలేదని కూడా అవంతి ప్రశ్నించారు. సిట్ నివేదికను ఎందుకు బయటపెట్టలేదన్న విషయంపై టీడీపీ నేతలు... ప్రత్యేకించి చంద్రబాబు - గంటా శ్రీనివాస్ లే సమాధానం చెప్పాలని కూడా అవంతి డిమాండ్ చేశారు. మొత్తంగా విశాఖ భూములపై రెండో సిట్ ఏర్పాటు కావడం ఖాయంగానే కనిపిస్తున్నా... ఈ విచారణలో నిందితులుగా తేలే వారికి కఠిన దండన కూడా తప్పదన్న వాదన వినిపిస్తోంది.