Begin typing your search above and press return to search.
రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు
By: Tupaki Desk | 7 March 2021 11:30 AM GMTఏపీ మంత్రి బాలినేని సంచలన ఆరోపణలు చేశారు. విదేశాల్లో రాసలీలలు చేసే లోకేష్ కు తనను విమర్శించే హక్కు లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి బాలినేని.. లోకేష్ పై దారుణ విమర్శలు గుప్పించారు. ‘లోకేష్ ఒక దరిద్రుడు.. చంద్రబాబు నీచుడు.. చంద్రబాబు, లోకేష్ ఇక్కడ దోచుకొని విదేశాల్లో దాచుకుంటున్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ నాపై మాట్లాడడం సిగ్గుచేటు. ’ అని మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు.
ప్రత్తిపాటితో కలిసి లోకేష్ పేకాట క్లబ్ నడిపిన విషయం ప్రజలకు తెలుసు అని.. నేను కులాలు చూడలేదని.. కమ్మ వారికి కూడా కార్పొరేషన్ లో టికెట్ ఇచ్చానని.. టీడీపీ వారు వ్యక్తిగత సమస్యలపై నా వద్దకు వస్తే పరిష్కరించానని మంత్రి బాలినేని తెలిపారు.
ఒంగోలు అభివృద్ధిపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని మంత్రి బాలినేని అన్నారు. ఒంగోలును తాను గతంలో ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నానన్నారు. టీడీపీ ఇన్ చార్జి దామచర్ల జనార్ధన్ బాగోతం అందరికీ తెలుసు అన్నారు. జనర్ధాన్ అప్పులు ఎగ్గొడితే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు.
తాను కరోనా సమయంలో ఒంగోలులో కోటి రూపాయలు సొంత డబ్బు ఖర్చు చేశానని మంత్రి బాలినేని అన్నారు. కుప్పంలో చంద్రబాబుకు పట్టిన గతే.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు.