Begin typing your search above and press return to search.

కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం

By:  Tupaki Desk   |   14 Nov 2021 7:30 AM GMT
కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం
X
భారతదేశంలోని మహిళలకు చీరకట్టు అంటే ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా.. అయితే కేరళలలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతిరోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు స్పందించారు.

టీచర్లు తప్పనిసరిగా చీరలు ధించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి వ్యక్తిగత అభిప్రాయమని.. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలపై మంత్రి బిందు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక టీచర్ కు అనేక బాధ్యతలు ఉంటాయని.. అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదని మంత్రి బిందు వ్యాఖ్యానించారు. మరొకరి దుస్తుల ఎంపికకు విమర్శించే, జోక్యం చేసుకు హక్కు ఎవరికి లేదని బిందు స్పష్టం చేశారు.

తానూ మంత్రిని మాత్రమే కాదని.. ఓ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాని.. తాను కాలేజీకి చుడీదార్లు వేసుకు వెళుతున్నాని తెలిపారు. ఈ మేరకు మహిళా టీచర్లు చీర ధరించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం ఓ సర్య్కూలర్ జారీ చేసింది.