Begin typing your search above and press return to search.

అమరావతి పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స !

By:  Tupaki Desk   |   27 Dec 2019 6:56 AM GMT
అమరావతి పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స !
X
ఏపీ రాజధాని అమరావతి పై మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే ధ్యేయం గా ఈ ప్రభుత్వం పని చేస్తోందని, అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు అని , వారికీ అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే కేబినెట్ సమావేశాని కి ఒక రోజు ముందు సిఆర్‌ డిఎ కార్యాలయంలో అయన మాట్లాడుతూ ..అమరావతిని ఐటి హబ్ లేదా ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేస్తామని ఆయన సూచించారు. మేము ప్రజలను మోసం చేయము. మేము భూములను అభివృద్ధి చేసి రైతుల కు తిరిగి ఇస్తాము. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదు అని బొత్స మరోసారి స్పష్టంచేశారు.

గత ఐదేళ్ల లో లక్షా 95 వేల కోట్ల రూపాయల అప్పు చేసిన చంద్రబాబు.. ఐదు వేల కోట్లు మాత్రమే అమరావతి నిర్మాణానికి ఖర్చు చేశారని మంత్రి అన్నారు. అమరావతి లో ఇప్పటి వరకూ కేవలం రూ.5,458 కోట్లు ఖర్చు చేశారని.. కేవలం ఒక్క శాతం పనులు మాత్రమే జరిగాయని బాబు పై ఫైర్ అయ్యారు. అమరావతి ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని పై కేబినెట్ చర్చించి నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పారు. అలాగే ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శల పై స్పందించిన మంత్రి, వారు రాజధాని నగరం పై తమ వైఖరి ని తరచూ మార్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భం లో మూడు రాజధానుల వ్యవహారం పై మంత్రి కొంచెం జాగ్రత్త గా సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని ఎక్కడ ఉంటుందనే విషయం పై క్యాబినెట్ భేటీ తరువాత
ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.