Begin typing your search above and press return to search.

మ‌నిషి పెర‌గ‌డం కాదు.. బుర్ర పెర‌గాలి: అచ్చెన్న‌పై మంత్రి బొత్స కామెంట్స్‌

By:  Tupaki Desk   |   8 March 2022 1:38 PM GMT
మ‌నిషి పెర‌గ‌డం కాదు.. బుర్ర పెర‌గాలి:  అచ్చెన్న‌పై మంత్రి బొత్స కామెంట్స్‌
X
ఏపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, అధికార ప‌క్షం వైసీపీ మ‌ధ్య రాజ‌ధాని అంశంపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం జ‌రిగే అవ‌కాశం క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బ‌య‌ట మీడి యా కేంద్రంగా ఇరు ప‌క్షాల నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

అయితే.. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చ‌న్నాయుడు కేంద్రంగా ఆయ‌న `బాడీ`ని రాజ‌కీయంగా వాడుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌తంలోనూ అసెంబ్లీలో అప్ప‌టి మంత్రిగా ఉన్న అచ్చెన్న‌ను ఉద్దేశించి అప్ప‌టి ఎమ్మెల్యే కొడాలి నాని.. ``ఎద్దండీ,.. ఎద్దు.. బాడీ పెరిగింది కానీ, బుద్ధి పెర‌గ‌లా`` అంటూ స‌భ‌లోనే కామెంట్లు కుమ్మ‌రించారు.

ఇక‌, ఇప్పుడు మ‌రోసారి.. రాజ‌దాని కేంద్రంగా సాగుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఇదే త‌ర‌హాలో అచ్చెన్న‌పై విరుచుకుప‌డ్డారు. `మ‌నిషి పెర‌గ‌డం కాదు.. బుర్ర పెర‌గాలి`` అని బొత్స కామెంట్లు చేశారు.

ఇది వాస్త‌వానికి స‌రైన వ్యాఖ్య‌లు కాక‌పోయినా.. అచ్చెన్నాయుడిపై వైసీపీ నేత‌లు చేస్తున్న కామెంట్లు మాత్రం ఇలానే ఉంటున్నాయి. గ‌తంలో సీఎం జ‌గ‌న్ కూడా అచ్చెన్నాయుడును అసెంబ్లీలోనే ఫిజిక‌ల్‌గా వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై టీడీపీ నేత‌లు దుమారం రేపినా.. ఆయ‌న మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోలేదు.

ఇక‌, ఇప్పుడు బొత్స కూడా అచ్చెన్న‌ను ఇదే త‌ర‌హాలో కామెంట్లు చేశారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కేంద్రం గుర్తించిందా? అని ప్ర‌శ్నించిన బొత్స‌.. ఇప్ప‌టికీ.. హైద‌రాబాదే ఉమ్మ‌డి రాజ‌ధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. త‌మ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

అంతేకాదు.. టీడీపీ హ‌యాంలో చంద్ర‌బాబు మ‌తిలేని విధానాల కార‌ణంగా ఏపీ వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. అమ‌రావ‌తిని రాజ‌దానిగా ప్ర‌క‌టించారు.. అంటూ.. బొత్స విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం జ‌రిగింది.

సీఆర్ డీఏపై మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలోని రైతులు అంద‌రికీ న్యాయం చేస్తుంద‌న్నారు. ఎవ‌రైతే.. స్వ‌చ్ఛందంగా భూములు ఇచ్చారో.. వారికి త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. అయితే..ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు.. బాడీని చూసి విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తుండ‌డం.. ప్ర‌జ‌లు హ‌ర్షించ‌డం లేదు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.