Begin typing your search above and press return to search.

పవన్ మీద ఆ రేంజిలోనా సీనియర్ మంత్రి గారూ...?

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:30 PM GMT
పవన్ మీద ఆ రేంజిలోనా సీనియర్ మంత్రి గారూ...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వారికి బాగా టార్గెట్ గా ఉన్నారు. ఆయన తుమ్మినా దగ్గినా కూడా వారికి చలిజ్వరం వచ్చేస్తోంది. ఆయన ఏమీ కాదు ఆయన గురించి మాట్లాడితే తమ స్థాయి తగ్గించుకోవడమే అంటూ కుండపోతగా విమర్శలు కురిపించేస్తారు. వారూ వీరూ కాదు జగన్ క్యాబినేట్ లో ఉన్న దాదాపు మంత్రులు అంతా పవన్ మీద విమర్శలకు అతి ఉత్సాహం చూపించేవారే.

పవన్ పాలసీల మీద మాట్లాడితే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే వైసీపీ నేతలకు తెలుసు అని జనసేన నాయకులు ఊరకే అనరు కదా. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో జగనన్న ఇళ్ల కాలనీని పరిశీలించారు. అక్కడ ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. సరే విపక్ష నేతగా ఆయన ప్రభుత్వం చేసిన పనుల విషయంలో తప్పులనే వెతికి మాట్లాడుతారు.

దానికి తాపీగా సాఫీగా జవాబు ఇవ్వాల్సింది ప్రభుత్వ పెద్దలది. తప్పు జరిగింది అంటే సరిచేసుకుంటామని చెప్పాలి. లేకపోతే లేదు అని మీది తప్పు అని ఒక పద్ధతిగా చెప్పాలి. కానీ అలా ఇలా కాకుండా ఏకంగా పవన్ మీదనే పడిపోతే ఎలా అంటున్నారు.

సీనియర్ మోస్ట్ మంత్రిని అని చెప్పుకునే బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ పవన్ విషయంలో బాగా ఫైర్ అయ్యారు. ఆయన ఒక సెలిబ్రిటీ. సెలిబ్రిటీ పార్టీ కాబట్టి జనాలు వస్తారు. అంతమాత్రాన నాయకుడు అయిపోతారా అంటూ బొత్స కామెంట్స్ చేశారు. అంతే కాదు మధ్యలో ఏనాడో చనిపోయిన సిల్క్ స్మితను తీసుకువచ్చారు. ఆమెకు కూడా ఎంతో క్రేజ్ ఉందని, ఆమెను చూసేందుకు కూడా జనాలు వస్తారంటూ వింత పోలికను తెచ్చారు.

మొత్తానికి బొత్స వారు చెప్పేది ఏమిటి అంటే జగనన్న కాలీనలలో ఏ విధమైన అవినీతి జరగలేదుట. ఆ ముక్కే హాయిగా హుందాగా మంత్రి హోదాకు సీనియారిటీకి తగినట్లుగా చెప్పి ఉంటే బాగుంటుంది కదా అని అంటున్నారు. అవినీతి తన జిల్లాలో ఇళ్ల నిర్మాణంలో జరిగిని అని తెలిస్తే తాను తలదించుకుంటాను అని ఆయన మరో మాట కూడా చెప్పారు. మరి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్న మంత్రి గారికి పవన్ ఒక నాయకుడుగా గురించలేని సీనియర్ నేతకు ఆయన ఎక్కడకు వచ్చి ఏ రకమైన విమర్శలు చేస్తే పోయేది ఏముంది అని అంటున్నారు.

పైగా బొత్స మరో మాట అన్నారు. పవన్ లాంటి వారి మీద విమర్శలు చేసి తన స్థాయిని తగ్గించుకోలేనని. మరి ఆయన స్థాయి ఎక్కువ అయినపుడు పవన్ జోలికి ఎందుకు వస్తున్నారు. ఎందుకు విమర్శలు చేస్తున్నారు అన్న ప్రశ్నలు కూడా జనసైనికుల నుంచి వస్తున్నాయి.

ఏది ఏమైనా ఒక్కటే విషయం. అది క్లియర్. పవన్ కి జనాలు వస్తున్నారు. ఆయన సభలు అదిరిపోతున్నాయి. గతంతో పోలిస్తే పవన్ స్పీచ్ కూడా సూటిగా జనానికి తాకుతోంది. దాంతోనే కలవరపడి పొరపడి త్వరపడి మంత్రులు అంతా ఇలా క్యూ కట్టి మరీ పవన్ మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు అని జనసైనికులు అభిప్రాయపడితే తప్పంటారా, లేక ఏమో..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.