Begin typing your search above and press return to search.
భూ కబ్జాలకు దిగిన మంత్రి తమ్ముడు ... ఎవరంటే
By: Tupaki Desk | 24 Dec 2019 7:22 AM GMTఆంధప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల సమస్యలని పరిష్కరించడానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్పందన కార్యక్రమంలో ఇప్పటికే కొంతమంది పలు సంచలనమైన ఫిర్యాదులు చేసారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు , రాజకీయ నేతలపై ఫిర్యాదులు చేస్తుండటం తో స్పందన పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడిపై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపింది. తమ భూమిని కబ్జా చేశారంటూ జాయింట్ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు ఆదినారాయణ తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో అధికారుల్ని కోరారు. విజయనగరంలోని సత్యసాయినగర్ లే అవుట్ లోని సర్వే నెంబరు 53-4, 53-5లలో కొంత స్థలాన్ని బాధితులైన కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ, అశోక్ కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ కొనుగోలు చేశామని, తామంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారమని, ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థలాన్ని తీసుకున్నామని, ఇప్పుడు ఆ స్థలాన్ని మంత్రి సోదరుడు ఆదినారాయణ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని స్పందన లో అధికారుల ముందు తమ గోడుని విన్నపించారు. లేఔట్‌లోని ప్లాట్స్‌ను కబ్జా చేశారని.. తమ లేఔట్ కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని బాధితులు ఆరోపించారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాలని.. తమ భూమిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారం పై మంత్రి తమ్ముడు ఏ విదంగా రియాక్ట్ అవుతాడో మరి చూడాలి.