Begin typing your search above and press return to search.
వావ్ ఏం చెబితిరి బుగ్గన.. జగన్ హయాంలో అప్పులు తక్కువట!
By: Tupaki Desk | 25 Jun 2022 4:26 AM GMTజగన్ ప్రభుత్వం అన్నంతనే విమర్శలకు బోలెడంత పని పెట్టేలా ఏపీ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అన్నింటికి మించి.. సంక్షేమం పేరుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పప్పు బెల్లాల మాదిరి ఖర్చు చేయటం.. మౌలిక వసతుల మీద పెద్ద ఫోకస్ చేయకుండా.. ఓటు బ్యాంక్ రాజకీయాల్ని నడిపే తీరుతో ఏపీ పెద్ద ఎత్తున అప్పుల పాలైన సంగతి తెలిసిందే. అయితే.. అలాంటి అభిప్రాయం తప్పని.. నిజానికి జగన్ ప్రభుత్వంలోనే అప్పులు తక్కువ చేసినట్లు చెప్పి సంచలనంగా మారారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ఆర్ బీఐ.. కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకులు.. వివిధ ఆర్థిక సంస్థలు.. పార్లమెంటు.. ప్రజల్లోనూ ప్రభుత్వం మీద చెడు భావన కలిగేలా విపక్ష టీడీపీ వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్రానికి సాయం (అప్పు) అందకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తుగడగా మండిపడ్డారు.
2014-15లో రాష్ట్ర ద్రవ్యలోటు 3.95 శాతం ఉంటే.. ఆ తర్వాతి కాలంలో నాలుగు శాతానికి అస్సలు తగ్గలేదన్నారు. కానీ.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం 2020-21 మాత్రం కొవిడ్ కారణంగా 5.10 శాతంగా ఉందని.. 2021-22లో 2.10 శాతానికి తగ్గినట్లుగా చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం ఏటా సగటున 19.46 శాతం కొత్త అప్పులు తెస్తే.. తాము మాత్రం 165.77 శాతం తెచ్చినట్లుగా చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.27,340 కోట్లతో పనులు నిర్వహిస్తే.. తాము మూడేళ్లలో రూ.27,448 కోట్లు ఖర్చు చేశామన్నారు.
అప్పుల మీద వడ్డీ సైతం తక్కువ మొత్తానికే తీసుకుంటున్నట్లు బుగ్గన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు చెల్లించటానికి సగటున పది రోజులు పడితే.. తాము మాత్రం మూడు నాలుగు రోజుల్లోనే ఇస్తున్నట్లు చెప్పారు.
ఇలా చెప్పుకుంటున్న బుగ్గనకు విలేకరులు బ్రేకులు వేస్తూ.. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించారు. దీనికి జవాబిచ్చిన ఆయన జీతాలు త్వరగా ఇస్తున్నామని.. పీఎఫ్.. వైద్య ఖర్చులు మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం. మరి.. అంతలా వెలిగిపోయేలా ఆర్థిక పరిస్థితి ఉంటే.. అప్పుల కోసం అంతలా ఆరాటపడాల్సిన పరిస్థితి ఎందుకు ఉన్నట్లు. అన్నది ప్రశ్న.