Begin typing your search above and press return to search.
'తూర్పు'లో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 5 Nov 2017 7:31 AM GMTఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలోని గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన కొంతమంది నాయకులు.. ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మాటల దాడి పెంచుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేల్లోనే సఖ్యత లోపించింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి చినరాజప్ప.. తన నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని సహించలేకపోతున్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు). దీంతో మంత్రిపై ఎదురు దాడికి దిగారు! నువ్వానేనా అంటూ పోరు నడుస్తుండటంతో జిల్లా రాజీకీయాలు హీటెక్కాయి!!
తూర్పు గోదావరిలో గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒక వర్గంపై మరోవర్గం అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి! ఆధిపత్యానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే వనమాడి స్వరం పెంచుతున్నారు. ఎమ్మెల్యే అని చూడడం లేదు. మంత్రి అని తగ్గడమూ లేదు. తన మాటల దాడి కొనసాగిస్తున్నారు. కాకినాడ నగరమంతా తనదిగా భావించడమే కాకుండా ఎంతటి పెద్ద నేతలైనా తన తర్వాతే అన్నట్టుగా కొండబాబు వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన కాకినాడ అందరిదీ అనే రీతిలో మంత్రి చినరాజప్పతోపాటు మిగతా నేతలూ భావిస్తున్నారు.
వాస్తవానికి ఎమ్మెల్యే కొండబాబుపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు సత్యనారాయణ సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు ఇవి అస్త్రాలుగా మారాయి. కాకినాడలో పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు తెరలేపారు. ఇదే క్రమంలో కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయులకు దక్కకుండా మంత్రి రాజప్ప, ఎంపీ తోట నర్సింహం వ్యవహరించారు. డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకో వాలని, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని కొండబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోయారు.
కార్పొరేషన్‌లోని కో ఆప్షన్ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా అది కూడా ఫలించేలా లేదు. దీంట్లో మంత్రి రాజప్ప జోక్యం చేసుకుని కొండబాబు వశం కాకుండా పావులు కదుపుతున్నారు. అవమానాలు, వస్తున్న ఆరోపణలతో కొండబాబు రగిలిపోతున్నారు. తానడిగిన మేరకు ఇవ్వకపోగా కాదన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు. మొన్నటికి మొన్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగగా, తాజాగా మంత్రి రాజప్పపైనే ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. మంత్రి సోదరుడే ఎక్కువ సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజప్పపెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారట. తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని పట్టుబడుతున్నారు.