Begin typing your search above and press return to search.

డ్రైనేజ్ క్లీన్ చేసిన మంత్రి .. ఎందుకబ్బా

By:  Tupaki Desk   |   4 Nov 2019 8:12 AM GMT
డ్రైనేజ్ క్లీన్ చేసిన మంత్రి .. ఎందుకబ్బా
X
రాజకీయ నాయకులంటే చెప్పడమే కానీ , దాన్ని పాటించరు అనే అపవాద ఒకటి ఉంది. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు .. ఆ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఆ ప్రజలే గుర్తుకురారు. మళ్ళీ ఎన్నికల సమయం రాగానే ప్రజలపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక ముఖ్యంగా మంత్రి స్థాయిలో ఉండే అధికారులు అయితే వారికీ ఉండే రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా కాన్వాయ్, ప్రోటోకాల్.. వారి చుట్టూ బాడీ గార్డ్స్ , లెక్కకుమించిన అనుచరులు. ఇంచుమించు అన్ని చోట్లా ఇదే రేంజ్ వ్యవహారం ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఒకలా ఉంటారు .. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత ఒకలా ఉంటారు.

కానీ , నేను అలాంటి నేతను కాను అని నిరూపించాడు ఒక మంత్రి. ఓ మంత్రి మురుగుకాలవలోకి దిగి డ్రైనేజ్ వ్యర్థాలను స్వయంగా క్లీన్ చెయ్యడం మీరు ఎప్పుడైనా చూశారా. అసలు మంత్రి ఏంటి మురుగుకాలువని క్లీన్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా .. కానీ , ఈ మంత్రి మాత్రం తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం డ్రైనేజ్ లో దిగి శుభ్రం చేసారు.

మధ్యప్రదేశ్లో రూలింగ్‌ కాంగ్రెస్ పార్టీ లీడర్ , ఆహార, పౌర సరఫరాల పురపాలకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రధుమన్ సింగ్ తోమర్.. గాల్వియర్ నియోజకవర్గంలోని బిర్లానగర్లో పరిశుభ్రత డ్రైవ్ చేపట్టారు. స్థానిక 16వ వార్డులోని మురికి కాలువలోకి దిగి శుభ్రం చేశారు. ఎనిమిది అడుగుల లోతున్న ఈ కాలువ చాలా రోజులగా క్లీన్ చెయ్యకపోవడంతో వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయింది. స్థానికులు కూడా విపరీతమైన దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. అలాగే వర్షాలకు నీరు బ్లాకై ఇళ్లలోకి చేరుతోంది. ఈ విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన మంత్రి తానే స్వయంగా మురుగుకాలవలోకి దిగి చెత్త బయటకు వేశారు. దీనితో మంత్రి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధుమన్ నియోజకవర్గం వ్యాప్తంగా 30 రోజుల పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు స్వచ్చతపై అవగాహాన కలిగించేందుకు ఆయన ఇలా చేశారు. ఏమైనా కూడా ఒక మంత్రి డ్రైనేజ్ లో దిగి స్వయంగా క్లీన్ చేయడం అంటే అభినందించాల్సిందే.