Begin typing your search above and press return to search.

అమ్మాయిల వివాదంలో చిక్కుకున్న మంత్రి

By:  Tupaki Desk   |   8 March 2016 12:59 PM IST
అమ్మాయిల వివాదంలో చిక్కుకున్న మంత్రి
X
మ‌ళ్లీ అదే మూర్ఖ‌పు ప్ర‌వ‌ర్త‌న‌. పెద్ద స్థాయిలో ఉన్న వారు జాగ్ర‌త్త‌గా, ప‌ద్ద‌తిగా వ్య‌వ‌హ‌రించాల‌నేది ఎప్పుడు తెలుసుకుంటారో అనే ఆవేద‌న‌, ఇంత చెత్త‌గా ఎలా ప్ర‌వ‌ర్తిస్తార‌నే అస‌హ‌నం క‌లిగే ప‌రిస్థితి. అమ్మాయిల ప‌ట్ల అమాత్యుడు వ్య‌వ‌హ‌రించిన చిల్ల‌ర త‌నం ఇపుడు వివాదంగా మారింది. తమిళనాడు క్రీడలు - యవజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్ బాలిక‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించడం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

సుందర్ రాజ్ ఇటీవల రాష్ట్రంలోని పుదుకొట్టాయ్ పాఠశాలను ఆకస్మింగా సందర్శించి అక్క‌డున్న క్రీడాకారిణుల‌తో మాట్లాడారు. మహిళా అథ్లెట్లు - హాకీ క్రీడాకారిణులను ఉద్దేశించి ఆయ‌న కుశ‌ల ప్రశ్న‌లే కాకుండా చెత్త ప్ర‌శ్న‌లు కూడా వేసి వేధించాడు. ఎన్ని పతకాలు గెలిచారని అడిగిన తర్వాత ఒక్క ప‌థ‌క‌మూ రాలేద‌నే స‌మాధానం ఓ విద్యార్ధి నుంచి రావ‌డంతో మంత్రి ఫైర‌య్యారు. పోటీల్లో గెల‌వ‌క‌పోతే భోజనం ఎందుకు పెట్టాలని స‌ద‌రు విద్యార్థినిపై గ‌ద్దించారు. ఇంకో విద్యార్థిని బ‌రువు గురించి ప్ర‌స్తావిస్తూ కాలేజీ వారికి రోజుకు రూ. 200 రూపాయలు ఇస్తూ మీకు మాత్రం ఎక్కువ డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ ఎందుకు శ‌రీరంపై శ్ర‌ద్ధ పెట్ట‌డంలేద‌ని మండిప‌డ్డారు.

మంత్రి ఇంత‌టితో ఆగిపోలేదు. హాస్ట‌ల్‌ లో చేరిన తర్వాత పెద్దమనిషివి అయ్యావా? అంటూ ఓ విద్యార్థి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా మాట్లాడారు. కొంద‌రు విద్యార్థులను ఉద్దేశించి మీకు తగినన్ని లోదుస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంత్రి మూర్ఖ‌పు ప్ర‌శ్న‌ల‌తో విద్యార్థులు అవాక్క‌య్యారు. అయితే చేసేదేమీ లేక ఊరుకుండిపోయారు. ఇదిలాఉండ‌గా మంత్రిగారి మూర్ఖ‌పు ప్ర‌వ‌ర్త‌న బ‌య‌ట‌కు పొక్కి ర‌చ్చ రచ్చ‌గా మారిన నేప‌థ్యంలో ఆయ‌న బుకాయింపు మాట‌లు మొదలుపెట్టారు. అంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్లాగే...తాను అన్న మాట‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని మండిప‌డ్డారు.