Begin typing your search above and press return to search.

'వైఎస్ కొడుకు కాబ‌ట్టే..' జ‌గ‌న్‌పై దిగ్విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   6 Sep 2022 6:08 PM GMT
వైఎస్ కొడుకు కాబ‌ట్టే.. జ‌గ‌న్‌పై దిగ్విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజ‌య్ సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``సీఎం జ‌గ‌న్‌.. అనే వ్య‌క్తి.. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడుగానే ప్ర‌జ‌లు చూస్తున్నారు. వైఎస్ కుమారుడు అనే.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించారు. అంత‌కు మించి.. ఆయ‌న‌ను నేత‌గా ప్ర‌జ‌లు ప‌రిగ‌ణించ‌డం లేదు.`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వైఎస్ ఫొటో తీసేసిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ అనే వ్య‌క్తిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తే.. అప్పుడు.. నిజంగానే ఆయ‌న‌ను నేత‌గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చున ని.. అన్నారు. వాస్త‌వానికి వైఎస్ కుటుంబంతో దిగ్విజ‌య్‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌రుచుగా దిగ్విజ‌య్ వైఎస్ ఇంటికి కూడా వ‌చ్చేవారు. వైఎస్ ఆయ‌న‌ను అన్న‌య్య అని అనేక సంద‌ర్భాల్లో సంబోధించారు. అయితే.. వైఎస్ మ‌ర‌ణాంత‌రం.. దిగ్విజ‌య్‌.. వైఎస్ కుటుంబానికి దూర‌మ య్యారు.

అదేస‌మ‌యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు..(ఉమ్మ‌డి రాష్ట్రంలో) దీనిని వ‌ద్ద‌ని చెప్పిన కేంద్ర నాయ‌కుల్లో దిగ్విజ‌య్ కూడా ఉన్నారు. అప్ప‌టి నుంచి వైఎస్‌కు దిగ్విజ‌య్‌కు మ‌ద్య అగాథం పెరిగింది. ఇదిలావుంటే.. విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ నాయ‌కుల‌ను త‌న పార్టీలోకి చేర్చుకుంటున్నార‌ని.. దిగ్విజ‌య్ ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.

``కాంగ్రెస్‌కు పుట్టిన బిడ్ద‌ల‌ను జ‌గ‌న్ సాకుతున్నాడు`` అని అప్ప‌ట్లోనే సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, తాజాగా మ‌రోసారి సీఎం జ‌గ‌న్‌పై దిగ్విజ‌య్ విరుచుకుప‌డ్డారు. సోనియాకు అత్యంత విధేయులైన నాయ‌కుల్లో దిగ్విజ‌య్ కూడా ఒకరు. వైఎస్ ఫొటో ఉంది కాబ‌ట్టి.. జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు ఎన్నుకున్నార‌న్న ఆయ‌న‌.. కాంగ్రెస్ నుంచి జ‌గ‌న్ విడిపోవ‌డానికి.. వేరు కుంప‌టి పెట్టుకోవ‌డానికి.. కేసులు పెట్ట‌డ‌మేన‌ని చెప్పారు. అయితే.. కేసులుపెట్టి కాంగ్రెస్ త‌ప్పు చేసిందా..? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం దిగ్విజ‌య్ దాట వేశారు. మ‌రోవైపు తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకుంటోంద‌ని దిగ్విజ‌య్ చెప్పారు.

అంతేకాదు.. తెలంగాణ ఇస్తే.. త‌మ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామ‌ని.. తెలంగాణ రాష్ట్ర స‌మితి.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి గ‌తంలో విభ‌జ‌న స‌మ‌యంలో చెప్పార‌ని.. దిగ్విజ‌య్ గుర్తు చేశారు. అయితే.. ఆయ‌న యూట‌ర్న్ తీసుకున్నార‌ని.. ఇప్పుడు బీజేపీపై పోరాడుతున్నార‌ని అన్నారు. కానీ, కేసీఆర్ ఎప్ప‌టికీ.. కాంగ్రెస్ మ‌నిషేన‌ని దిగ్విజ‌య్ చెప్ప‌డం ..గమ‌నార్హం. మ‌రోవైపు.. బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర మంచి ఫ‌లితాలు ఇస్తుంద‌ని దిగ్విజ‌య్ ఆశాభావం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.