Begin typing your search above and press return to search.
మంత్రి ఎర్రబెల్లి...ఈ సారి ఇంకో వార్తతో తెరపైకి
By: Tupaki Desk | 12 Jan 2020 1:13 PM GMT‘ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయుడు. ఈ మంత్రి పదవి ఆయన పెట్టిన భిక్షే’అని నాల్రోజుల క్రితం కామెంట్ చేసి వార్తల్లో నిలిచిన టీఆర్ ఎస్ నేత - తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి - పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా ఇంకో వార్తతో తెరకెక్కారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి పొలం దున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో తన పొలంలో ఎర్రబెల్లి ఇలా వ్యవసాయం చేయడం వార్తల్లో నిలిచారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న తన పొలం పనుల్లో మంత్రి ఎర్రబెల్లి బిజీబిజీగా గడిపారు. పర్వతగిరిలోని తన పొలాన్ని ట్రాక్టరుతో దున్నిన మంత్రి దయాకర్ రావు ఈ సందర్భంగా పొలం పనుల గురించి ఆరాతీశారు. తర్వాత గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పారుశుద్ధ్యం - డ్రైనేజీని పరిశీలించారు. తాను ఏ స్థాయికి ఎదిగినా పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచిపోనని - ఊరు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని మంత్రి దయాకర్ రావు చెప్పారు. వర్ధన్నపేట నుంచి మూడు సార్లు - పాలకుర్తి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనను ఏ ముఖ్యమంత్రి గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల జీవితాలు బాగుపడతాయని మంత్రి దయాకర్ రావు అన్నారు.