Begin typing your search above and press return to search.
ఈసారి మహిళా ఎంపీపీ.. మరో వివాదంలో మంత్రి
By: Tupaki Desk | 7 Aug 2021 12:54 PM GMTతెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు, చేష్టలు ఈ మధ్యకాలంలో తరుచుగా వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఒక అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియాలో హైలెట్ అయ్యింది. ఆ వివాదాన్ని మరిచిపోకముందే మరో వివాదంలో మంత్రి ఎర్రబెల్లి చిక్కుకున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి తనను అవమానించారని స్థానిక ఎంపీపీ రాణి ఆరోపించారు. కార్యక్రమానికి ఆహ్వానం పలికిన అధికారులు తనను స్టేజీమీదకు రానివ్వలేదని అన్నారు. బలవంతంగా తనను కార్యక్రమం నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమలాపూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా స్వయం సహాయక సంఘం సభ్యులకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోనే పాల్గొనేందుకు వచ్చిన ఎంపీపీ రాణి స్థానిక టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు తనను వేధిస్తున్నారంటూ మంత్రితో చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ఎర్రవెల్లి తనను స్టేజీపైకి రానివ్వలేదని ఆమె ఆరోపించారు. కమలాపూర్ ఎంపీపీ అయినా నన్ను కార్యక్రమానికి ఆహ్వానించారని.. నాకు అన్యాయం జరిగిందని చెబుతుంటే బయటకు నెట్టేశారని ఇదెంత వరకు న్యాయం అని ఆమె నిలదీశారు.
శనిగరంలో వేణు అనే టీఆర్ఎస్ కార్యకర్త రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో నాపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని ఎంపీపీ ఆరోపించారు. ఆ బాధ చెప్పుకోవడానికి వెళితే నన్ను బయటకు వెళ్లగొట్టారని తెలిపారు.చెప్పలేని పదాలతో అతడు నాపై పోస్టులు పెడుతున్నాడని ఆ ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చానని తెలిపారు. నా భర్తను చంపేస్తానంటున్నాడని మహిళా ఎంపీపీ ఆరోపించారు.
ఒక ఎంపీపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుందని నిలదీశారు. ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పీకేస్తానని కేసీఆర్ అంటున్నారని..ఇప్పుడు బాధ చెప్పుకోవడానికి స్టేజీ మీదకు వెళ్తే నెట్టేశారని ఎంపీపీ రాణి వాపోయారు.
ఇక గతంలో మహిళా ఎంపీడీవో విషయంలో కూడా మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన గ్రామ సభలో మంత్రి ఎర్రబెల్లి ఎంపీడీవో ఉన్నారా? అంటూ అడిగారు. మంత్రి వెనుకాల వచ్చి నిలుచుకున్న మహిళా ఎంపీడీవోను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎర్రబెల్లి ఇరుకునపడ్డారు. మంత్రి స్థాయిలో ఉండి మహిళా ఎంపీడీవోను గ్రామసభలో అందరి ముందు అవమానిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. బాగా ట్రోల్ చేశారు.ఇవి ఎర్రబెల్లిని పరేషాన్ లో పడేశాయి. దీంతో వివరణ ఇచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే కొందరు తన మాటలను సంచలనం కోసం వక్రీకరించారని.. ఇలా వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదని ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. ఉద్యోగులు, అధికారులపై తనకు గౌరవం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ మహిళా అధికారి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధంతోనే ‘బాగున్నవా బిడ్డా’ అంటూ పలకరించానని.. అందులో పెడర్థాలు తీయవద్దని ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణ ఉచ్చరణలో భాగంగా ‘మీరు బాగా ఉరికి పనిచేస్తున్నారని.. ఇంకా అందరినీ ఉరికించి పనిచేయించాలని’ ఆ మాటలు అన్నానని.. ప్రొత్సహించడానికే అలా అన్నట్టు ఎర్రబెల్లి తన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.దీన్ని కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించారని ఇది సరికాదని హితవు పలికారు. ఇప్పుడు మహిళా ఎంపీపీ ఆరోపణలతో మరోసారి ఎర్రబెల్లి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.