Begin typing your search above and press return to search.

సకల సమస్యలకు కారకుడు సజ్జలట...?

By:  Tupaki Desk   |   1 Oct 2022 3:50 PM GMT
సకల సమస్యలకు కారకుడు సజ్జలట...?
X
ఆయనను ముద్దుగానో లేక నిష్టూరంగానో సకల శాఖల మంత్రి గారు అని పిలుచుకుంటారు. ఆయనే ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఆయన వైసీపీ అధినేత జగన్ పత్రికను పూర్వాశ్రమంలో చూసేవారు. ఆయన పార్టీ రాజకీయాల్లోకి సడెన్ గా వచ్చారు. కానీ వేగంగా ఎదిగారు అని వైసీపీలో గుసగుసలు పోయిన వారు ఉన్నారు.

ఇదిలా ఉంటే సజ్జల జగన్ కి ఆత్మ అని అంటారు. అప్పట్లో వైఎస్సార్ కి కేవీపీ మాదిరిగా సజ్జల జగన్ కాంబోను పోలుస్తారు. ఏ శాఖకు అయినా ఆయన నోటి వెంట సమర్ధంగా జవాబు వస్తేనే ప్రభుత్వానికి తృప్తి ఉంటుంది అని కూడా అంటారు. అలాంటి సజ్జల వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఆయన ప్రత్యర్ధులను తనదైన శైలిలో మాటలతో చెడుగుడు ఆడతారు. సరే ఏపీ రాజకీయాల్లో సజ్జల రోల్ బాగానే ఉంది. అది అలాగే సాగుతోంది. అయితే ఆయన ఉన్నట్లుండి తెలంగాణా మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు.

హరీష్ ఇటీవల ఏపీ సర్కార్ పనితీరు మీద విమర్శలు గుప్పించారు. అంతే కాదు ఏపీలో కరెంట్ ఎపుడు వస్తుందో తెలియదు అని ఎకసెక్కెమాడారు. ఏపీ టీచర్లను జగన్ సర్కార్ ఏడిపిస్తోంది అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దానిని ఎటాక్ చేసే క్రమంలో సజ్జల వారు రంగంలోకి వచ్చారు.

హరీష్ రావు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదు అంటూ ఆయనకు అక్కడ ఆ స్టేట్ లో సొంత సమస్యలు ఏవైనా ఉంటే అది చూసుకోవాలని, తమ మామ కేసీయార్ తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాట్లాడుకోవాలన్నట్లుగా సెటైరికల్ గా కామెంట్శ్ చేశారు. దానికి ఇపుడు సరైన కౌంటర్ తెలంగాణా నుంచి పడిపోయింది.

తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్ అయితే మాతో ఎందుకు గోక్కోవాలని అనుకుంటున్నారు సజ్జల గారూ అని ఎదురు దాడి చేశారు. కేసీయార్ కి హరీష్ రావు కు మధ్య ఏదో ఉందని అర్ధం వచ్చేలా మాట్లాడుతూ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అయితే కేసీయార్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాలని చూసినా అది విఫలం అవుతుంది అని హెచ్చరించారు.

ఇక సజ్జల స్వభావమే చిచ్చులు పెట్టుడు అని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయన వైఎస్సార్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టారని, తల్లిని కొడుకుని విడదీసారని, అలాగే అన్నకు చెల్లెలును కూడా వేరు చేశారని విమర్శించారు. ఇక ఏపీలో జగన్ బీజేపీకి బీ టీం అని గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కామెంట్ చేశారు.

మాతో గోక్కోవాలని చూస్తే అసలు బాగోదు, 2014లో ఎలా ఉద్యమం చేశామో చూశారుగా అంటూ గంగుల టీయారెస్ మార్క్ కామెంట్స్ చేయడం విశేషం. ఇవన్నీ ఎలా ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టారని, సకల సమస్యలకు ఆయనే కారణం అంటూ గంగుల నోరు చేసుకోవడమే ఇపుడు చర్చకు వస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.