Begin typing your search above and press return to search.
తెలంగాణ సంపద కోసం.. ఏపీ నేతలు క్యూ కడుతున్నరు: మంత్రి సంచలన కామెంట్లు
By: Tupaki Desk | 22 Dec 2022 5:30 PM GMTతెలంగాణ రాష్ట్ర సంపదపై కన్నేసిన కొందరు ఏపీ నాయకులు క్యూ కట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని.. ప్రజలు మేల్కోవాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు మొదలు పెట్టకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో గంగుల ఈ మేరకు మాట్లాడారు.
‘‘తెలంగాణ సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ పోరాటం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంపద పెరిగింది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల వెరైటీ ముసుగుతో ఇక్కడికొచ్చారు. కేఏ పాల్, పవన్‌కల్యాణ్ కూడా వచ్చారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ప్రవేశించారు. తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారు. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాడు ముక్కలు. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి అజెండా. ఏపీ మూలాలున్న మీకు.. తెలంగాణ గడ్డపై ఏం పని? వీళ్లందరి వెనుకా బీజేపీ ఉంది.`` అని గంగుల అన్నారు.
అంతేకాదు.. హైదరాబాద్ సంపదను, తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. షర్మిలతో పాటు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ బీజేపీ బాణాలేనని చెప్పారు. బీఆర్ ఎస్‌తో కేసీఆర్ సైన్యం దేశమంతా వెళ్తుంటే.. తెలంగాణపైకి వీళ్లంతా ఎందుకొస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఏపీలో బీఆర్ ఎస్ పోటీ
ఏపీలోనూ బీఆర్ ఎస్ పార్టీ పోటీ చేస్తుందని గంగుల తెలిపారు. ఏనాడూ తెలంగాణ ప్రజలు ఏపీ సంపదను దోచుకోవాలనుకోలేదని చెప్పారు. అందుకే ఏపీలో బీఆర్ ఎస్ పక్కాగా పోటీ చేస్తుందని అన్నారు. గతంలో తెలంగాణను దోచుకున్న వాళ్లు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాళ్లు కూడా మిమ్మల్ని నమ్మరు అని గంగుల కమలాకర్ చంద్రబాబు సహా ఇతర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.