Begin typing your search above and press return to search.
మంత్రి గంగుల కమాలకర్ కు నకిలీ ఈడీ నోటీసు
By: Tupaki Desk | 25 Aug 2021 6:30 AM GMTటీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ చుట్టూ పుకార్లు షికార్దు చేస్తున్నాయి. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన గ్రానైట్ వ్యాపారంపై ఈడీ నోటీసులు జారీ చేసిందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులు జారీ చేసిందని.. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగింది.
ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమాలకర్ కు ఈడీ పేరిట నకిలీ నోటీసు పంపారు ఆగంతకులు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని.. అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే గంగుల కమలాకర్ ఈడీ అధికారులను సంప్రదించారు. ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా సైబర్ క్రైమ్ మంత్రి గంగులకు పోన్ చేసింది. అయితే ఈ నకిలీ ఈడీ నోటీసుపై మంత్రి గంగుల కమాలకర్ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు.
కరీంనగర్ కేంద్రంగా మంత్రి గంగుల సోదరులకు గ్రానైట్ బిజినెస్ ఉంది. ఇక గంగులకు ప్రధాన ప్రత్యర్థి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే గంగుల గ్రానైట్ వ్యాపారంపై బండి సంజయ్ ఈడీకి లేఖలు రాయడం.. వారు చర్యలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు మంత్రి గంగులకు ఈ నోటీసులు జారి చేసినట్లు తెలిసింది.