Begin typing your search above and press return to search.

ప్రజలకు రియల్ ఎస్టేట్ సలహా ఇచ్చిన మంత్రి

By:  Tupaki Desk   |   23 May 2022 8:12 AM GMT
ప్రజలకు రియల్ ఎస్టేట్ సలహా ఇచ్చిన మంత్రి
X
హైదరాబాదు పొరుగున ఉన్న యాద‌గిరి గుట్ట‌కి ఇక్క‌డ ఉన్న శ్రీ‌కాకుళం కు ఎంతో తేడా ? యాదగిరి గుట్టలో పెరుగుతున్న రేట్లు చూసి చాలా మంది రైైతులు గత 20 ఏళ్లుగా భూములు అమ్ముకున్నారు. ఆల‌యం అభివృద్ధి అయ్యాక అక్క‌డ రియ‌ల్ వెంచ‌ర్లు వ‌చ్చి విప‌రీతం అయిన వ్యాపారం జ‌రిగి సంబంధిత వ‌ర్గాలు ఎంత‌గానో ఆర్థిక ల‌బ్ధి పొందాయి. ఆ విధంగా భూమి ఎక్క‌డ‌యినా అభివృద్ధి చెందితే చాలు ముందుగా తొందరపడి అమ్ముకున్న వర్గాలు రోడ్డున ప‌డిపోతున్నాయి. అమ్మని వారు బాగుపడ్డారు. అమ్మి సొమ్ము చేసుకున్న వారు రోడ్డున పడ్డారు.

అలాంటి పొరపాటు మీరు చేయుొద్దు అంటున్నారు రెవెన్యూ మంత్రి ధర్మాన. భూములు అమ్మవ‌ద్ద‌ని, తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాన‌ని అటుపై ఏమ‌యినా ఇటువంటి చ‌ర్య‌లు తీసుకుంటే రైతుకు మేలు జ‌రుగుతుంద‌ని హితవు చెప్పారు. రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ఇవాళ ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శ్రీ‌కాకుళం రూర‌ల్ మండ‌లం, తండేంవ‌ల‌స‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొని, అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తాను ఈ గ్రామాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తాన‌ని, రోడ్లు వేసి మ‌రింత వ‌న్నె తీసుకు వ‌స్తాన‌ని చెబుతూ, అప్ప‌టిదాకా ఎవ‌రెవ‌రో మాట‌లు న‌మ్మి భూములు అమ్ముకోవ‌ద్ద‌ని హిత‌వు చెప్పారు.

స‌హ‌జ శైలికి అనుగుణంగా ధ‌ర్మాన చెప్పిన మాట‌లు కాస్త ఆలోచ‌నాత్మ‌కంగానే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో విప‌క్ష పార్టీల‌కు ఆయ‌న కౌంట‌ర్లు ఇచ్చారు. అదేవిధంగా వంశ‌ధార నీళ్ల‌ను ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా వ‌చ్చే ఏడాది అందిస్తామ‌ని అన్నారు. త‌ద్వారా ఇక్క‌డ మూడు పంట‌లు పండే అవ‌కాశాలు ఉంటాయి అని చెప్పారు.

ఎందుకు ఆ మాట అన్నారంటే..

శ్రీ‌కాకుళం న‌గ‌రం క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. న‌గ‌రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారాలు బాగా పెరిగిపోతున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కు ఇప్పుడే కొనుగోలు చేసి త‌రువాత వాటిని వెంచ‌ర్లుగా చేసి అమ్ముకోవాల‌న్న యోచ‌నలో వ్యాపారులు ఉన్నారు.

అందుకే న‌గ‌రాభివృద్థి జ‌రిగేక అమ్ముకోవాల‌ని ధ‌ర్మాన సూచించారు. అదేవిధంగా నగ‌ర విస్త‌ర‌ణ‌కు త‌న‌వంతు సాయం ఉంటుంది అని, శివారు పంచాయ‌తీల‌కు తాగునీరు స‌మ‌స్య రాకుండా చూస్తాన‌ని చెప్పారు.