Begin typing your search above and press return to search.
మంత్రి గుడివాడ... హడలెత్తించేస్తున్నారుగా...?
By: Tupaki Desk | 26 Aug 2022 3:30 AM GMTఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ ని చూసి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇపుడు జడుసుకుంటున్నారా. ఎందుకు అలా అంటే దాని వెనక ఒక స్టోరీ ఉంది అంటున్నారు. అసలే యువ రక్తం. పైగా రాజకీయ కుటుంబం, ఇక బలమైన సామాజిక నేపధ్యం. ఇంకో వైపు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిండు ఆశీర్వాదం. ఇవన్నీ కలసి మూడున్నర పదుల వయసున్న గుడివాడను అత్యంత బలవంతుడిగా మార్చేశాయి.
అసలే ఉడుకు రక్తం. దాంతో నా మాటే శాసనం అన్న తీరున ఆయన వైఖరి సాగుతోందా అంటే అవును అనే అంటున్నారు వైసీపీ పార్టీ వారు. అదే వైసీపీలో అనకాపల్లిలో ఏడు పదుల వయసు దాటిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గుడివాడ బాధితునిగా మిగిలిపోయారని చెబుతారు. గుడివాడ తండ్రి గురునాధరావు సమకాలీకుడు దాడి వీరభద్రరావు. అనకాపల్లికి అరువొచ్చిన గుడివాడను తన వాడిగా భావించి జగన్ మాట మీద గెలిపించిన దాడికి ఆ తరువాత ఇదే గుడివాడ చుక్కలు చూపించారని దాడి అనుచరులు వాపోతారు.
ఇక వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గుడివాడ పోటీ చేసినా దాడి వర్గం సహకారం ఉండదనే అంటున్నారు. పైగా అక్కడ బలంగా ఉన్న గవర సామాజికవర్గం కూడా గుడివాడ అంటే గుర్రు మీద ఉంది అంటున్నారు. అదే టైమ్ లో నాన్ లోకల్ ట్యాగ్ తో ఆయన్ని ఓడిస్తామని పార్టీ బయటా లోపలా కూడా చెబుతున్న వేళ ఈ యువ మంత్రి వచ్చే ఎన్నికల్లో సేఫ్ జోన్ ఏంటి అని సెర్చ్ చేసే పనిలో పడ్డారు. దాంతో మిగిలిన చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయిన వైసీపీ నేతలు గుడివాడ అంటే హడలుతున్నారు.
గుడివాడ ఆ మధ్య దాకా పెందుర్తి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. గుడివాడను అన్నా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతారు. అలాంటిది గుడివాడ తన సీటు మీదనే కర్చీఫ్ వేస్తున్నారని తెలియడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇదే సంగతిని ఆయన ఇటీవల విశాఖ వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రమాక్రిష్ణారెడ్డికి చెప్పుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
దాంతో పెందుర్తి మీద ఒక వైపు గురి పెడుతూనే గుడివాడ మరో సీటు మీద కూడా కన్నేశారు అని అంటున్నారు. ఆ సీటే ఎలమంచిలి. దాంతో అక్కడ సీనియర్ నేత, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబు రాజు ఫైర్ అవుతున్నారుట. తన మీద గుడివాడ అనుచరులు నిరధార ఆరోపణలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దీని వెనక ఎలమంచిలిలో పోటీ చేయలన్న వ్యూహం ఉందని రాజు గారు అనుమానిస్తున్నారుట. సిట్టింగుల సీట్లో వేలు కాలు పెట్టడమేంటి అని కూడా రాజు గారి వర్గీయులు గుస్సా అవుతున్నారని టాక్.
ఇంకో వైపు విశాఖ నార్త్ మీద కూడా గుడివాడ కన్ను ఉన్నా అక్కడ జగన్ సన్నిహితుడు కేకే రాజుకే టికెట్ అంటున్నారు. నిజానికి గాజువాక గుడివాడ సొంత ప్లేస్. అయితే అక్కడ తిప్పల నాగిరెడ్డి బలంగా ఉన్నారు. దాంతో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్ధం కాక ఈ యువ మంత్రి రోజుకో సీటు మీద చూపులు విసురుతూంటే సొంత పార్టీలోనే హడలెత్తుతున్నారుట. మరి జగన్ అయినా ఏం చేయగలరు. ఏదో ఒక సీటు అనుకుని వస్తే ఆయన టికెట్ ఇస్తారు కానీ ఇలా ఉన్నవి అన్నీ చుట్టబెడితే తానున్న పార్టీలో కలి పెడితే ఛూస్తూ ఊరుకుంటారా అని వైసీపీలోనే అంటున్నారుట.