Begin typing your search above and press return to search.
టీవీ వాళ్లు ప్రైజ్ అంటే రూ.7లక్షలు తీసుకుందట
By: Tupaki Desk | 6 Nov 2015 3:55 PM GMTకెమేరా కళ్లకు అడ్డంగా దొరికి పోయిన తర్వాత కూడా కప్పిపుచ్చుకునేలా మాట్లాడటంలో రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మంత్రి అంజనేయ సతీమణి వ్యహారం తెలిసిందే. రూ.7కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించేందుకు రూ.7లక్షల లంచం తీసుకోవటమే కాదు.. అదంతా టీవీ ఛానల్ కెమేరా సాక్షిగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడా రాష్ట్రంలో రాజకీయ కలకలాన్ని సృష్టిస్తోంది.
దీంతో.. మంత్రి అంజనేయ ఇరుకున పడ్డారని.. ఆయన పని అయిపోయిందని పలువురు భావించారు. కానీ.. అందుకు భిన్నంగా మంత్రిగారు కొత్త కథను వినిపిస్తున్నారు. రూ.7లక్షల మొత్తాన్ని తీసుకొని కెమేరాకు దొరికిపోయిన భార్య గురించి చెబుతూ.. ఆమె చాలా అమాయకురాలని.. స్టింగ్ ఆపరేషన్ వెనుక చాలానే కథ నడించిందని.. తనను మంత్రి కుర్చీ నుంచి తప్పించటానికి పెద్ద కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన భార్యకు ఏమీ తెలీదని.. పల్లెటూరు మహిళ అని చెప్పుకున్న మంత్రిగారు.. తన ఇంటికి అతిధులు.. స్నేహితులు.. బంధువులు.. తెలిసిన వారు తరచూ వచ్చిపోతుంటారని.. అలా వచ్చిన వారు పండ్లు.. మిఠాయి పాకెట్లు లాంటివి తెచ్చి ఇస్తారని.. అలానే టీవీ చానల్ వాళ్లు వచ్చి బహుమతి అని చెబితే తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
ఏవో కార్డులు ఉన్నాయని చెబితే తన భార్య పాకెట్ తీసుకుందని.. కానీ.. అది డబ్బుతో నిండిన బహుమానంగా ఆయన చెప్పారు. తనను తప్పించటానికి ఇలాంటివెన్నో చేస్తున్నారని.. దళితుల్లో తక్కువ వర్గానికి చెందిన తనపై రాజకీయ ప్రతీకారం కోసమే ఇలాంటివి చేశారని చెప్పుకొచ్చారు. ఇన్ని మాటలు చెప్పిన మంత్రిగారు.. తన పదవికి రాజీనామా చేయనని కూడా తేల్చేశారు. ఎంత పల్లెటూరుకు చెందిన భార్య అయితే మాత్రం టీవీలో బహుమతి వచ్చిందంటే తీసేసుకుంటారా? మంత్రివర్యులు చెప్పినట్లుగా ఆయన సతీమణి మరీ అ..మాయకురాలా?