Begin typing your search above and press return to search.

ముందస్తు ఎన్నికలపై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   28 Nov 2022 12:30 PM GMT
ముందస్తు ఎన్నికలపై మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం మళ్లీ మొదలైంది. డిసెంబర్ లోనే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని.. అనంతరం అసెంబ్లీ రద్దు ప్రకటన చేస్తారని.. ముందస్తుకు కేసీఆర్ వెళతారని ప్రచారం సాగుతోంది.

తాజాగా కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని ఆదేశించడంతోపాటు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మెట్రో రెండో దశ ప్రారంభం లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ముందస్తు ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ పార్టీకి లేదని.. తాము కానీ.. తమ పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పలేదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్తామనేది బీజేపీ జ్యోతిష్యులు చెప్పే మాటలు అని.. వాళ్లే అప్పుడప్పుడు ఎన్నికలపై జోస్యం చెబుతారంటూ హరీష్ సెటైర్లు వేశారు. తాము జైలుకు వెళ్తామని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కొంతమంది బీజేపీ నేతలు జ్యోతిష్యం చెబుతూ ఉంటారని హరీష్ రావు విమర్శించారు.

మునుగోడులో టీఆర్ఎస్ కు మెజార్టీ తగ్గడాన్ని చూసి బీజేపీ బలపడిందని అనకుంటే పొరపాటు అని.. బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందన్నారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే దొరకలేదని.. అక్కడ ఆ పార్టీ బలంగా లేదన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో బీజేపీ వ్యక్తుల బలం వల్లే అన్ని ఓట్లు గెలుపు వచ్చాయని హరీష్ రావు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో తమకు , కాంగ్రెస్ తోనే పోటీ ఉంటుందని హరీష్ రావు అన్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఉందని.. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ చాలా బలంగా ఉందని హరీష్ రావు అన్నారు. బీజేపీకి అతి తక్కువ నియోజకవర్గాల్లో మాత్రమే క్యాడర్ ఉందన్నారు. కొన్ని చోట్ల నాయకులు లేని పరిస్థితి ఉందని హరీష్ రావు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.