Begin typing your search above and press return to search.
బండి , రేవంత్ అందలానికి కేసీఆర్ కారణమట..
By: Tupaki Desk | 2 Sep 2021 12:44 PM GMTతెలంగాణలో మాటల మంటలు అంటుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఇద్దరు కొత్త అధ్యక్షులు వచ్చారంటే అది కేసీఆర్ వల్లేనని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి పీసీసీ, బండి సంజయ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావడానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదని.. పెంచిన గ్యాస్, డీజిల్ ధరలపై ఢిల్లీ యాత్రలు చేయాలని సూచించారు.
టీఆర్ఎస్ పార్టీ జలదృశ్యంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయిందన్నారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే.. టీఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తోందని అని తెలిపారు.
తెలంగాణకు నీరు రాదన్న ప్రతిపక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవసాక్ష్యం అని హరీష్ రావు చెప్పుకొచ్చాడు. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తోందన్నారు. పెరగాల్సిన జీడీపీ తగ్గుతుంటే ప్రజల నడ్డి విరిచే పెట్రో ధరలు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు పాదయాత్ర చేసేది తెలంగాణలో కాదు.. ఢిల్లీలో చేయాలని హరీష్ రావు సూచించారు.
కొన్ని పార్టీలు ఆంధ్రా నాయకుల చేతిలో ఢిల్లీ నాయకుల చేతిలో పనిచేస్తున్నాయని.. కానీ టీఆర్ఎస్ కు ప్రజలే హైకమాండ్ అని తెలంగాణ ఇంటి పార్టీ లోకల్ పార్టీ అని హరీష్ పేర్కొన్నారు.
ఇలా ప్రతిపక్షాల విమర్శలకు హరీష్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు పదవులు రావడానికి కేసీఆర్ కారణం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.