Begin typing your search above and press return to search.
పాల వ్యాపారం మొదలు పెట్టిన మంత్రి హరీశ్ రావు కుటుంబం !
By: Tupaki Desk | 22 Aug 2020 5:15 AM GMTతెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కుటుంబం సరికొత్త వ్యాపారం ప్రారంభించింది. మంత్రి హరీశ్ రావు గారి సతీమణి శ్రీనిత తాజాగా పాల వ్యాపారం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె పాల ఉత్పత్తుల్ని శుక్రవారం ఆవిష్కరించారు. మిల్చి మిల్క్ పేరుతో పాల ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ,స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు చాలా అవసరం అని ఆమె తెలిపారు.. చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో పాల ఉత్తత్తులు చేపడుతున్నట్లుగా వివరించారు. అలాగే , వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేయబోతున్నట్టు తెలిపారు.
ఇకపోతే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హరీష్ రావుకి ఓ కుమారుడు ఉన్నారు. ఇకపోతే , తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు . ఇక , 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నారు. ప్రస్తుతం కెసిఆర్ క్యాబినెట్ లో ఆర్థికశాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.