Begin typing your search above and press return to search.
రాజాసింగ్ కు అదిరిపోయే షాకిచ్చిన హరీశ్ రావు
By: Tupaki Desk | 7 May 2022 2:01 AM GMTబీజేపీ ఎమ్మెల్యే, పాతబస్తీ నుంచి వరుస విజయాలు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్న ఫైర్ బ్రాండ్ నేత రాజాసింగ్ అధికార టీఆర్ఎస్ పార్టీ అంటే తనదైన శైలిలో దూకుడుగా స్పందించే సంగతి తెలిసిందే. అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీపై విరుచుకుపడుతుంటారు.
టీఆర్ఎస్ నేతలు సైతం తగ్గేది లే అంటూ ఆయనకు కౌంటర్ ఇస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావు తాజాగా డైరెక్టుగా రాజాసింగ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్ సందర్శించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి హరీష్ రావు కోఠి ఈఎన్టీ హాస్పిటల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. సేవలు అద్భుతంగా ఉన్నాయని పేషెంట్లు తెలపడంతో... పక్కనే ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌తో... రాజాసింగ్ సాబ్ జర సునో... వీళ్లు చెప్తున్నది నిజమే కదా అంటూ హరీష్ రావు చిరునవ్వు వ్యక్తపరిచారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు అద్భుతమని మరోసారి రుజువైందని రాజాసింగ్ తో హరీష్ రావు తెలిపారు. కళ్ల ముందే నిజం కనిపిస్తుండటంతో రాజాసింగ్ సైతం మరోరకంగా స్పందించలేకపోయారు.
కాగా, అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కోఠి ఈఎన్టీ హాస్పిటల్ కు సీఎం మరిన్ని డాక్టర్ పోస్టులు మంజూరు చేశారని అన్నారు. రూ.35 కోట్లతో బిల్డింగ్ నిర్మిస్తున్నామని అన్నారు.
ఇందులో 100 పడకలు, 8 ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి హరీష్ రావ్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం అని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తమిళనాడును దాటి తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్, టీ డయాగ్నసిస్ సర్వీసులు దేశానికి ఆదర్శంగా మారాయని చెప్పారు. తెలంగాణ మోడల్ ను మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మంత్రి చెప్పారు.