Begin typing your search above and press return to search.
హరీశ్ రావు... స్వీపర్, వెండర్, షాప్ కీపర్!
By: Tupaki Desk | 18 April 2017 2:04 PM GMTతెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహణ కోసం అయ్యే ఖర్చును సమకూర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించగా... ఆ పార్టీ నేతలు ఒకరికి మించి మరొకరు అన్న చందంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కుమారుడు - మంత్రి కేటీఆర్ ఐస్ క్రీమ్ బాయ్ గా అవతారం ఎత్తగా ఆయన చెల్లి - నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ఏకంగా చీరలమ్మే మహిళగా కొత్త అవతారం ఎత్తారు. ఈ పనుల ద్వారా వారిద్దరూ ఏకంగా రూ.14.3 లక్షలు సంపాదించారు. ఇందులో కేటీఆర్ ది రూ.7.3 లక్షలు కాగా, కవిత వాటా రూ.7 లక్షలు.
ఇక కాసేపటి క్రితం పార్టీలో మరో కీలక నేత - మంత్రి - కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు రంగంలోకి దిగారు. తన బావమరిది - మరదలు ఒక్కో అవతారంలోనే కనిపించగా - వారికి భిన్నంగా కనిపించాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ... ఒకే రోజు మూడు అవతారాలు ఎత్తారు. సభ నిర్వహణకు అవసరమయ్యే నిధుల కోసం కూలీ పని కోసం వరంగల్ వెళ్లిన హరీశ్ రావు... అక్కడ మూడు రకాల కూలీ పనులు చేశారు. తొలుత లక్ష్మీనరసింహ ఆసుపత్రికి వెళ్లిన హరీశ్ అక్కడ స్వీపర్ గా అవతావరం ఎత్తారు చీపురు పట్టి ఆసుపత్రిలోని వార్డులను ఊడ్చారు. ఆ తర్వాత నగరంలోని అమృతా సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన ఆయన అక్కడి క్యాంటీన్ లో చిప్స్ అమ్మేందుకు సేల్స్ బాయ్ అవతారం ఎత్తారు.
ఇక ముచ్చటగా మూడో కూలీ పని కూడా చేయాలని భావించిన ఆయన అక్కడి నుంచి నేరుగా బీఎస్ కే జ్యూవెల్లర్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడ షాప్ ముందు షాప్ కీపర్ అవతారం ఎత్తిన హరీశ్... అక్కడ కాసేపు భద్రతా విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ మూడు కూలీ పనులకు కలిపి ఎంతమేర హరీశ్ సంపాదించారన్న వివరాలు వెల్లడి కానున్నా... సదరు మొత్తాన్ని ఆయన పార్టీ బహిరంగ సభ ఖర్చు కోసం ఇస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/