Begin typing your search above and press return to search.
'మంత్రిగారు బిజీ.. ఎవరినీ కలవరు!' వేలాడుతున్న బోర్డు!!
By: Tupaki Desk | 11 Jan 2023 4:11 AM GMT'మంత్రిగారు బిజీ..ఎవరినీ కలవరు' ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి గారి ఆఫీసులో గత వారం రోజులుగా ఈ బోర్డు వేలాడుతోందట. అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. నిజమేనని వైసీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. పోనీ.. ఫోన్లు చేసి మాట్లాడాలన్నా.. ఎంగేజ్ వస్తోందట. ఎప్పుడు చేసినా.. ఫోన్లు ఎంగేజ్ రావడంతో అసలు ఏం జరుగుతోందనే చర్చ పార్టీలోనే సాగుతోంది.
సరే.. ఇదిలావుంటే.. మంత్రిగారి కోసం.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులు క్యూకట్టారు. ఆయన కనిపిస్తే చాలు.. అని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారట. దీనికి కారణం.. మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది. ఈ క్రమంలో కోడి పందేలు, ఇతరత్రా పందేల నిర్వహణ తప్పదు కదా! సంప్రదాయం కూడా. మరీముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పందేల నిర్వహణ ప్రతిష్టాత్మకం కూడా.
అయితే.. ఇప్పుడు జీవో 1 వచ్చిన తర్వాత అనుమతులు సాధారణ సభలకే ఇవ్వడం లేదు. ఇక, కోడి పందేల నిర్వహణపై ఎప్పుడూ.. వివాదం ఉన్నదే. అయితే.. కనీసం .. అనధికార అనుమతులు అయినా.. ఇప్పించాలని కోరుతూతూర్పుగోదావరికి చెందిన ఒక మంత్రి ఇంటికి.. నాయకులు క్యూకట్టారు.
అయితే.. ఈ తాకిడి భరించలేక.. పోనీ.. వారిని కాదని కూడా అనలేక.. మంత్రివర్యులు.. నానా తిప్పలు పడుతున్నారట.
ఈ క్రమంలో పీఏ ఇచ్చిన సలహాతో ఒక బోర్డు పెట్టేశారు. మంత్రిగారు గడపగడపకు కార్యక్రమానికి సంబం ధించి చర్చించే పనిలో ఉన్నారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు కలవడం కుదరదు.. అని రాసుకొచ్చారు. దీనివల్ల మంత్రికి రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు ఆయన అనుచరులు కూడా చెబుతున్నారు.
ననిత్యం ఆయన గడపగడపకు కార్యక్రమంలో ఉన్నారనే సందేశం పార్టీ అధిష్టానానికి, పాపం ఎంతో బిజీగా ఉన్నారు కాబట్టితమను కలవలేకపోతున్నారనే సంకేతాలు పార్టీ వర్గాల్లోకి వెళ్తాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.