Begin typing your search above and press return to search.

దిశ కంటే పవర్ ఫుల్ మంత్రి గారు...?

By:  Tupaki Desk   |   7 May 2022 2:51 PM GMT
దిశ కంటే పవర్ ఫుల్ మంత్రి గారు...?
X
ఏపీలో వైసీపీ సర్కర్ దిశ గురించి చాలా గొప్పలు చెప్పుకుంది. అయితే ఈ రోజుకీ అది చట్టంగా అమలు కాలేదు. ఇంకో వైపు మహిళల మీద అత్యాచారాలతో ఏపీ అట్టుడికిపోతోంది. వరస ఘటనలతో ప్రభుత్వం కార్నర్ అవుతోంది. విపక్షాల చేతిలో చిత్తు అవుతోంది. ఈ నేపధ్యంలో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే పోలీసులు సత్వరమే వచ్చి న్యాయం చేస్తారు అని చెబుతూ ఎక్కడికక్కడ దిశ యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

శ్రీకాకుళంలో జరిగిన ఈ డ్రైవ్ లో పాల్గొన్న మంత్రి సీదరి అప్పలరాజు అయితే ఉగ్ర రూపమే చూపించారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తాను వారి పాలిట అరవీర భయంకరుడినే అవుతాను అని ఆయన హెచ్చరించారు. ఎవరైతే అత్యాచారం చేస్తారో వారిది కోసి మరీ కారం పెడతాను, ఏమనుకుంటున్నారో అని మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.

తాను కనుక అన్నగా అబలల‌ పక్కన ఉంటే దిశ కంటే పవర్ ఫుల్ అని కూడా ఆయన తేల్చేశారు. సరే ఇంతకీ దిశ యాప్ సంగతి ఏంటి స్వామీ అంటే దాని కంటే ముందు తన పవర్ ఏంటో మంత్రి గారు చెప్పుకున్నారు. మరి ఇదే మాటను కొన్నాళ్ళ క్రితం ఎవరో అన్నట్లు ఏపీ జనాలు విన్నట్లు కూడా గుర్తుంది అంటున్నారు.

ఆ అన్నది ఎవరో కాదు, ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే స్పీడ్ గా జగనన్న తోడుగా ఉంటారు అని అప్పట్లో జగన్ చెప్పుకున్నారు. మరి దిశ చట్టం అయితే ఈ రోజుకీ కాలేదు.

ఇక చట్టాల కంటే భయాలు అన్నవి అవసరం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, తాట తీస్తుంది అన్న సంకేతాలు పంపాలి. కానీ ఎందుకో ఏపీలో మాత్రం అరాచక శక్తులకు ఆ భయం ఉందా అన్నదే సందేహం.

మరి విషయం అలా ఉంటే మంత్రి తాను కోసి కారం పెడతాను, వారి సంగతి తేలుస్తాను అంటూ గట్టిగా మాట్లాడడం వల్ల ఉపయోగం ఉందా అన్న చర్చ అయితే వస్తోంది. మొత్తానికి అప్పలరాజు సెకండ్ టెర్మ్ మంత్రి కావడంతో ఆయన లో ఫైర్ బ్రాండ్ ని అలా బయటకు తీస్తున్నారు అన్న మాట.