Begin typing your search above and press return to search.

అడ్డంగా దొరికిపోయిన కోమ‌టిరెడ్డి.. 20 వేల కోట్లపై.. ఈసీ వ‌ద్ద‌కు వెళ్తామ‌న్న మంత్రి

By:  Tupaki Desk   |   8 Oct 2022 12:28 PM GMT
అడ్డంగా దొరికిపోయిన కోమ‌టిరెడ్డి.. 20 వేల కోట్లపై.. ఈసీ వ‌ద్ద‌కు వెళ్తామ‌న్న మంత్రి
X
ఉప ఎన్నిక జ‌రుగుతున్న మునుగోడు అసెంబ్లీ స్థానంలో బీజేపీ అప్ర‌క‌టిత అభ్య‌ర్థి, మాజీ సిట్టింగ్ ఎమ్మె ల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అడ్డంగా బుక్క‌య్యారా? ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఆయ‌న‌ను ఇర‌కాటంలోకి నెట్టేలా ఉన్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి. మునుగోడులో టీఆర్ ఎస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఎన్నిక‌ల బాధ్య‌త‌లు చూస్తున్న జ‌గ‌దీశ్‌రెడ్డి.. తాజాగా.. కోమ‌టిరెడ్డిపై విరుచుకుప‌డ్డారు.

కోమ‌టిరెడ్డి కాంట్రాక్టుల కోస‌మే.. బీజేపీలోకి చేరాడ‌ని.. 20వేల కోట్ల కాంట్రాక్టులు ద‌క్కించుకున్నాన‌ని.. స్వ యంగా ఆయ‌నే చెప్పాడ‌ని.. ఆయ‌నో దొరికిపోయిన దొంగ అని.. వ్యాఖ్యానించారు. అందుకు సంబంధిం చిన వీడియో తమ వద్ద ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి.. కోమటిరెడ్డి.. బహిరంగంగా అమ్ముడుపోయారని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను తీసుకువ చ్చారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. బీజేపీలో చేరిన వైనంపైనా మంత్రి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆరు సీట్లు ఉన్న పార్టీని వదిలి మూడు సీట్లు ఉన్న బీజేపీలోకి చేర‌డం వెనుక‌.. వ్యూహం ఉంద‌ని.. అన్నారు. బీజేపీలోల చేరితే.. అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలో భాగంగా బీజేపీ తెచ్చిన ఉప‌ ఎన్నిక అని మంత్రి జగదీశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఉప పోరులో బీజేపీకి ప్ర‌జ‌లు త‌గిన విధంగా బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ఫార్మర్ గా, కోవర్టుగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కోసం పని చేశారని మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి తనపై పరువు నష్టం దావా వేస్తానని చెబుతున్నారని దావా వేస్తే.. అన్ని విష‌యాలూ వెలుగులోకి వ‌స్తాయ‌ని అన్నారు.

అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల మీద మాట్లాడారని, ఆయనే నేరుగా తమకు వచ్చిన కాంట్రాక్టుల గురించి చెప్పారని అన్ని ఆధారాలు ఉన్నాయని మంత్రి వివ‌రించారు. వాటిని ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకువెళ్తామ‌ని హెచ్చ‌రించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.