Begin typing your search above and press return to search.

మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేనా...

By:  Tupaki Desk   |   26 April 2019 8:41 AM GMT
మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేనా...
X
గత వారం రోజులుగా ఇంటర్ వివాదం తెలంగాణను కుదిపేస్తోంది.. రెండు రోజుల క్రితం సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి.. రీ కౌంటింగ్ - రీ వెరిఫికేషన్ ఉచితంగా చేస్తామని ప్రకటన చేశారు.. అలాగే ఇంటర్ కు సంబంధించి కొత్త విధానాన్ని అనుసరించాలని - మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో చూడాలని ఆదేశించారు.అయినప్పటికీ విపక్షాలు ఆందోళనను మానలేదు.కలెక్టరేట్ల ముట్టడి - ధర్నాలు - గవర్నర్ కు కలసి వినతి పత్రాలివ్వడం ఇలా వారి తరహా నిరసనను తెలుపుతూనే ఉన్నాయి..ప్రధానంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్ ఒక్కటే విద్యా మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని...నిజంగా ఇంటర్ వివాదానికి బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలా...

గతేడాది డిసెంబర్ 13న కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు..ఆయనతో పాటు మహ్మద్ అలీ హోం మంత్రిగా బాద్యతలు స్వీకరించారు..కొద్ది రోజులకే మంత్రి వర్గాన్ని విస్తరించి.. గత క్యాబినెట్ లో విద్యా - విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డిని తిరిగి విద్యా మంత్రిగా క్యాబినెట్ లో తీసుకున్నారు..అంటే జగదీశ్ రెడ్డి బాధ్యతలు తీసుకొని కేవలం పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు...ఇంతలోనే ఇంటర్ వివాదం తెరపైకి వచ్చింది.. అసలు వివాదానికి కారణంటూ ప్రచారంలో ఉన్న గ్లోబరీనా సంస్థ కు గతంలో జగదీశ్ రెడ్డి విద్యా మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా..మళ్లీ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత అనుమతి ఇచ్చారా అనే ప్రశ్న తలెత్తుతోంది.. ఆ సంస్థ అనుమతులకి జగదీశ్ రెడ్డి కి సంబంధం ఉందా అనేది కీలక ప్రశ్న...

ఒక శాఖ మంత్రి గా ఖచ్చితంగా జగదీశ్ రెడ్డికి బాధ్యత ఉంటుంది.అయినంత మాత్రాన ఒక వివాదం చోటు చేసుకున్నప్పుడు మంత్రిగా వచ్చి ఐదు నెలలైనా కాలేదు..జగదీశ్ రెడ్డిని బాధ్యుణ్ని చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతుంది... ఖచ్చితంగా బాధ్యులైన అధికారుల్ని గానీ - సంస్థలను గానీ - అలాగే త్రిసభ్య కమిటీ నివేదికలో పొందుపరిచినదాని బట్టి కొందరిపై చర్య తీసుకోవచ్చు..కానీ ఏదైనా శాఖలో ఏదో జరిగిందని మొత్తానికి మంత్రిని బాధ్యులు చేస్తామా అన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తోంది..

అయితే గతంలో రైల్వే ప్రమాదంపై లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా నుంచి చాలా మంది మంత్రుల రాజీనామాలను ఎక్కువ మంది ప్రస్తావిస్తున్నారు..జరిగిన సందర్బం ఏంటీ..నిజంగా మంత్రి నిర్లక్షం ఉందా.. మంత్రి చెప్పడం వల్లే గ్లోబరీనా సంస్థకు ఛాన్స్ ఇచ్చారా... మంత్రి అనునాయిడి ఈ స్కాంలో ప్రమేయం ఉందా.. ఇలాంటి ఏ సందర్బమూ ఎదురు కానప్పుడు జగదీశ్ రెడ్డిని బాధ్యుణ్ని చేయాలనే ప్రశ్న బయలుదేరుతోంది..

అందుకే సీఎం కూడా మంత్రి రాజీనామా విషయంపై అంత సీరియస్ గా తీసుకోలేదంటున్నారు..సమీక్ష నిర్వహించి కీలక చర్యలకు సీఎం సిద్దమయ్యారు.. కానీ ఒకటి మాత్రం నిజంగా తెలిసి తెలిసి జగదీశ్ రెడ్డి విద్యా శాఖ ఎందుకు తీసుకున్నారని అని్ చాలా మంది అనుకుంటున్నారు.. గత ప్రభుత్వంలో కూడా ఆయన విద్యా మంత్రిగా ఉన్నప్పుడు ఇలా రెండు వివాదాలు వచ్చి ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెట్టాయి.. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది.. అవకాశం ఉంటే భవిష్యత్తులోనైనా వేరే శాఖను తీసుకోవాలని ఆయన అనుచరుల్లో కూడా చర్చ జరుగుతోందంటున్నారు...గతంలో పంచాంగం సందర్బంగా కూడా సీఎంకు రవీంద్రభారతి వేదిక గా పంచాంగ కర్తలు ఓ హెచ్చరిక చేశారు.. మీ ప్రభుత్వానికి తలవంపులు వస్తాయంటే అది విద్యా - వైద్యం వల్లేనని..