Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా హీరోలకు వైసీపీ మంత్రి హెచ్చరిక!

By:  Tupaki Desk   |   5 Dec 2022 10:31 AM GMT
తెలుగు సినిమా హీరోలకు వైసీపీ మంత్రి హెచ్చరిక!
X
కర్నూలులో హైకోర్టుకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలులో డిసెంబర్‌ 5న సీమ గర్జన నిర్వహించింది. పది రోజుల ముందుగానే దీనికి ఏర్పాట్లు చేయడం, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించి ఆ బస్సుల్లో విద్యార్థులను తరలించడం వంటివి చేయడంతో ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు.

కాగా ఈ సీమ గర్జన సభలో తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలను ఉద్దేశించి వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్‌ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా సినిమా హీరోలు మాట్లాడాలని వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా రాయలసీమ ఇప్పటికీ పేదరికంలోనే ఉందని జయరామ్‌ అన్నారు. ఒక్క జగనన్న మాత్రమే కర్నూలుకు జ్యుడీషియల్‌ రాజధానిని ప్రకటించి మన భవితవ్యాన్ని మార్చేశాడని తెలిపారు. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఆదుకోవాలని టాలీవుడ్‌ హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వ్యాఖ్యానించారు.

తెలుగు హీరోలు తమ సినిమాలను రాయలసీమలో చిత్రీకరిస్తున్నారని మంత్రి జయరామ్‌ గుర్తు చేశారు. కర్నూలు కర్నూలు అంటూ హీరోలు తమ వల్ల వేల కోట్లు సంపాదిస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. హీరోలంతా ఏకమై రాయలసీమకు హైకోర్టు కావాలని డిమాండ్‌ చేయాలని కోరారు. హీరోలు మా రాయలసీమ పేరును వాడుకుంటూ.. మా కర్నూలు జిల్లా నుండి వేల కోట్లు సంపాదించుకుంటున్నారని జయరామ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ సందర్భంగా టాలీవుడ్‌ హీరోలందరినీ హెచ్చరిస్తున్నానని మంత్రి జయరామ్‌ అన్నారు. మీరందరూ తమ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరారు. మూడు రాజధానులు, కర్నూలు న్యాయ రాజధాని మన జగనన్నకే సాధ్యమని తెలిపారు. అది సాధించే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి అంటూ మంత్రి కోరారు.

ఇప్పటికే గుమ్మనూరు జయరామ్‌ పలు వివాదాల్లో కూరుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రికాగానే బెంజ్‌ కారు పొందారనే విమర్శలు చెలరేగాయి. అది తన కుమారుడికి బహుమతిగా ఇచ్చారని చెప్పుకోవడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత మంత్రి సొంత గ్రామంలో భారీ ఎత్తున పేకాట నడుపుతున్న వ్యవహారంలో ఆయన సోదరుడినే పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల ఒకే రోజు రైతులకు చెందిన 180 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు చేజిక్కుంచుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలుగు అగ్ర పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు హీరోలపై మంత్రి జయరామ్‌ చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.