Begin typing your search above and press return to search.

కొడాలి నాని 'RGV' ని ఫాలో అవుతున్నాడా?

By:  Tupaki Desk   |   21 March 2022 2:30 PM GMT
కొడాలి నాని RGV ని ఫాలో అవుతున్నాడా?
X
వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, టీడీపీ నాయ‌కులు ముద్దుగా బూతుల మంత్రి అని పిలుచుకునే ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఆర్‌జీవీ.. రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఫాలో అవుతున్నాడా? ఆయ‌న‌లాగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇంత‌కీ ఆర్ జీవీ ఎలా ఉంటాడో చూద్దాం. ఆర్ జీవీ అంటేనే డిఫ‌రెంట్‌. ఆయ‌న స్ట‌యిల్ డిఫ‌రెంట్‌. ఇప్ప‌టికి ఎన్నో సినిమాలు తీశాడు. అయితే.. వాటిని చాలా డిఫ‌రెంట్‌గా ఆయ‌న ప్ర‌మోట్ చేస్తారు. త‌ను నేరుగా.. త‌న సినిమాల‌ను చూడ‌మ‌ని ఎవ‌రికీ చెప్ప‌డు. అలాగ‌ని ఇంట్లోనూ కూర్చోడు.

ఇంకోమాట‌లో చెప్పాలంటే.. అస‌లు ఆర్‌జీవీ.. తను తీసేసినిమాల‌ను ఎవ‌రూ చూడొద్ద‌ని ప్ర‌చారం చేస్తాడు. అంటే.. ఇదొక ట్రెండన్న మాట‌. చూడొద్దు అంటే, చూడ‌మ‌ని.. అర్ధం. ఇలా కూడా బిజినెస్ః చేయొచ్చ‌ని ఆర్‌జీవీ నిరూపిస్తాడు. ఇలా ఇండైరెక్ట్‌గా ప్ర‌మోట్ చేసుకుంటాడు. అంతేకాదు.. నా సినిమాలు మిమ్మ‌ల్ని ఎవ‌రూ చూడ‌మ‌న‌రు అని.. కూడా చెబుతుంటాడు.

అయితే సినిమా ప‌బ్లిసిటీలో ఇదొక‌.. వింత ప్ర‌చారం. ఇదిలావుంటే. నిన్న‌ ఆయ‌న ఒక పోస్టు పెట్టాడు. ఒక చెట్టు నాటుతున్న‌ట్టు ఫొటోలో ఉంది. అయితే.. దీనికి ఆయ‌న పెట్టిన కామెంట్ ఏంటంటే.. ``నాకు చెట్టు నాట‌డం ఇష్టం లేదు. అయినా.. నాటుతున్నాను`` అని! మ‌రి దీనిని బ‌ట్టి ఆయ‌నకు ఇష్టం ఉందా? లేదా.? అనేది మ‌న‌మే అర్ధం చేసుకోవాలి.

ఇక‌, మంత్రి కొడాలి నాని విష‌యానికి వ‌ద్దాం.. ఈయ‌న ఒక డిఫ‌రెంట్ నాయ‌కుడు. ఈయ‌న తన కులాన్నే త‌ర‌చుగా తిడుతూ ఉంటాడు. అదేం చిత్ర‌మో.. కానీ, ఎవ‌రూ ఏ నాయ‌కుడు కానీ.. త‌న కులాన్ని తిట్టిన సంద‌ర్భం మ‌న‌కు ఏపీలో ఎక్క‌డా క‌నిపించదు.

ఒక్క ఏపీలోనే కాదు.. బ‌హుశ దేశంలో ఎవ‌రు మాత్రం త‌మ త‌మ కులాల‌ను తిడ‌తారు లేండి! కానీ, నాని స్ట‌యిల్ ఆర్ జీవీ త‌ర‌హాలో ఉంటుంది క‌దా! అందుకే ఆయ‌న కూడా ఆర్‌జీవీనే అనుస‌రిస్తారు. ఇక్క‌డ చిన్న లాజిక్ ఏంటంటే.. ఎలాగూ త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు త‌న‌కే ప‌డ‌తాయ‌నే ధీమా. దీంతో ఇలా త‌న వాళ్ల‌ను త‌నే తిట్ట‌డం ద్వారా.. మిగిలిన కులాల ఓట్లు దండుకోవ‌చ్చ‌ని.. ఇదొక ప్లాన్ అంటారు.. గుడివాడ ప్ర‌జ‌లు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా సాగుతుంద‌నుకోండి!

అంతే కాదు.. నాని అనుస‌రించే విధానం రాజ‌కీయాల్లో కొత్త ట్రిక్ అంటున్నారు గుడివాడ జ‌నాలు. నిజానికి.. ఇత‌ర నేత‌లు కూడా మా క్యాస్ట్ వాళ్లు మాత్ర‌మే మాకు ఓట్లేస్తే మేం గెలిచామా.. అంద‌రూ వేస్తేనే క‌దా.. గెలిచింది! అని అంటూ వుంటారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌ల మాదిరిగా. నిజానికి వీరు చెప్పిన లాజిక్‌ను లోతుగా ప‌రిశీలిస్తే.. వాస్త‌వ‌మే అనిపిస్తుంది.

ఏ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడైనా.. కూడా ఆ సామాజిక వ‌ర్గం వాళ్లు మాత్ర‌మే ఓట్లు వేస్తే.. గెలిచే అవ‌కాశం లేదుక‌దా! కానీ, పార్టీల వ్య‌వ‌హారం చూస్తే.. మాత్రం.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఎవ‌రి ఓట్లు అంటే.. ఏ సామాజిక వ‌ర్గం ఓట్లు ఉన్నాయో. చూసి కానీ, ఆ సామాజిక‌వ ర్గానికి చెందిన నాయ‌కుడికి సీటు ఇవ్వ‌రు. ఎవ‌రి ఓట్లు ఎక్కువ‌గా ఉంటే.. వారికే టికెట్‌.

అలాగే గుడివాడ‌లో కూడా ఒక సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి.. కాబ‌ట్టి.. మంత్రి అక్క‌డ టీడీపీ లో అయినా.. వైసీపీలో అయినా.. పోటీ చేసిన‌ప్పుడు. గెలుపు గుర్రం ఎక్కుతున్నాడు. కానీ, బ‌య‌ట‌కు మాత్రం టీడీపీని,ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గాన్ని మాత్రం తిడుతుంటాడు. అంటే.. ఇది కూడా ఒక‌ర‌కంగా.. ఇండైరెక్ట్ ప్రొమొష‌న్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో నోరున్న వారిదే.. క‌దా రాజ్యం.. అన్న‌ట్టుగా.. మంత్రిగారి త‌డాకా.. అంతా ఇంతాకాద‌న్న‌మాట‌.