Begin typing your search above and press return to search.
మంత్రి కొట్టుకు తీవ్ర నిరసన.. `గో బ్యాక్` నినాదాలు.. రీజన్ ఇదే
By: Tupaki Desk | 15 April 2022 4:44 PM GMTఏపీలోని జగన్ సర్కారులో తాజాగా మంత్రిపదవిని దక్కించుకున్న కాపు నాయకుడు కొట్టు సత్యనారాయణకు అప్పుడే జనాల నుంచి సెగ తగిలింది. మంత్రిగా ఆయన పదవిని చేపట్టి.. ముచ్చటగా మూడు రోజులు కాకుండానే ... ప్రజల నుంచి తీవ్ర విమర్శ లు.. నిరసన ఎదుర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఆయన హతాశులయ్యారు. అంతేకాదు.. ఇకపై అలా చేయను! అంటూ.. ప్రజలకు వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇంతకీ.. ఏం జరిగిందంటే..
కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రి కొట్టుకు.. దేవదాయ శాఖను అప్పగించారు. దీంతో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండోరోజే.. ఆలయాల పర్యటనకు బయలు దేరారు. తొలిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇక్కడ సర్వదర్శనం కోసం.. మంగళవారం చోటు చేసుకున్న ఘటనపై స్పందించారు. భక్తుల మధ్య తోపులాట జరిగిన ఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులను అప్రమత్తం చేశామని సత్యనారాయణ అన్నారు. టైం స్లాట్ విధానం వల్ల భక్తులు రెండు, మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.
టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తులను వాకబు చేశానన్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. అంటే.. తన దూకుడును ఆయన పెంచారన్నమాట.. అని మంత్రిపై అప్పుడే.. చర్చ సాగింది. ఇదే దూకుడుతో ఉన్న మంత్రి తాజాగా వాయులింగ క్షేత్రమైన.. శ్రీకాళహస్తికి కూడా వెళ్లారు.
అయితే.. ఆయన వెళ్లీ వెళ్లడంతోనే.. నేరుగా గర్భాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. అప్పటికే కొన్ని గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. వేసవి తాపాన్ని తట్టుకోలేక.. ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుని బయటపడదామా ? అని ఎదురు చూస్తున్నారు. అయితే.. మంత్రి రాకతో ముందస్తుగా ఉన్న క్యూలైన్లు అధికారులు నిలిపివేశారు.
దీంతో అప్పటికే గంటల సమయం వేచి ఉన్న భక్తులు మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ``మంత్రి అయితే.. ఏంటి?`` అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు.. ``గోబ్యాక్`` అంటూ.. నినాదాలు చేశారు. అంతేకాదు.. క్యూలైన్లలో గంటల తరబడి ఉన్నతమకు కనీసం తాగునీరు ఏర్పాటు చేయలేదంటూ మండిపడ్డారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న కొట్టు.. వెంటనే తేరుకుని.. భక్తులతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.