Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఎవ‌రి ఫ్యాన్ అంటే...

By:  Tupaki Desk   |   7 May 2018 4:15 PM GMT
కేటీఆర్ ఎవ‌రి ఫ్యాన్ అంటే...
X
మ‌న పిల్ల‌లు విదేశీ సూప‌ర్ హీరోలపై ఎగ‌బ‌డుతున్న‌పుడు ఓ సంచ‌ల‌నంగా వ‌చ్చిన ఇండియ‌న్ సూప‌ర్ హీరో ఛోటా భీమ్‌. ఇండియాలో ఛోటా భీమ్‌ అంటే తెలియని పిల్లలు దాదాపుగా ఉండరు. ఒక‌ కార్టూన్ టీవీలో సీరియ‌ల్‌ గా అల‌రించిన ఛోటా భీమ్ భార‌తీయ పిల్ల‌ల ఫేవ‌రెట్‌. పిల్ల‌ల‌కు ఏం తెలిసినా పేరెంట్స్‌ కు తెలియ‌కుండా ఎలా ఉంటుంది? అందుకే అది అంద‌రిలో పాపుల‌ర్‌.

అయితే, ఇపుడు దానిని ఎందుకు త‌ల‌చుకుంటున్నామంటే... పిల్లలను విశేషంగా ఆకట్టుకుకున్న ఆ ఇండియ‌న్ సూప‌ర్ హీరోకి ఇది టెన్త్ బ‌ర్త్ డే. ఈ సందర్భంగా నగరంలోని హెచ్‌ఐసీసీలో సోమవారం *ఛోటాభీమ్‌ సీరియల్ ద‌శాబ్ది ఉత్స‌వాలు* ఘ‌నంగా నిర్వ‌హించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజ‌ర‌య్యారు.

ఎప్ప‌టికెయ్య‌ది ప్ర‌స్తుత‌మో అన్న‌ట్లు వ‌క్తగా పేరొందిన కేటీ రామారావు *నేను కూడా ఛోటా భీమ్ ఫ్యాన్‌* అంటూ అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు. ఇపుడు ఐటీ బాగా అభివృద్ధి చెంద‌టంతో మ‌న ఊహాలోకాల‌ను సృష్టించుకుని క‌ళ్ల ముందు చూసుకునే అద్భుత అవ‌కాశాన్ని మ‌నం ఆస్వాదిస్తున్నామ‌ని, అందుకే యానిమేష‌న్ బాగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు. కార్టూన్స్‌ పాత్రలతో పిల్లలకు యానిమేషన్‌ రంగంపై ఆసక్తి కూడా కలుగుతుందన్నారు. అయితే, ఇండియాలో పుట్టిన ఈ సూప‌ర్ హీరో ఛోటా భీమ్‌ ప్రాంతాలకు, భాషలకు అతీతంగా గ్లోబ‌ల్ గా పాపుల‌ర్ అయ్యింద‌న్నారు.

యానిమేషన్ ఇండస్ట్రీ దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని కేటీఆర్‌ తెలిపారు. గేమింగ్ రంగంలో ఎప్ప‌టికైనా ప్ర‌పంచంపై పైచేయి సాధించాల‌నే ల‌క్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్‌ టవర్స్ కు హైదరాబాద్‌లో శంకుస్థాప‌న చేశామ‌ని కేటీఆర్ వివ‌రించారు. ఇది కేవ‌లం యానిమేష‌న్‌కు అంకితం చేసిన మౌలిక స‌దుపాయాల విభాగం అని, గేమింగ్‌పై ఎవ‌రూ చూప‌నంత శ్ర‌ద్ధ చూపుతామ‌ని కేటీఆర్ చెప్పారు.