Begin typing your search above and press return to search.
మోడీ మీద సీరియస్ ఆరోపణ చేసిన కేటీఆర్
By: Tupaki Desk | 8 Oct 2022 5:14 AM GMTగడిచిన కొంతకాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు మీదా.. ప్రధాని నరేంద్ర మోడీ మీదా రాజకీయంగా.. వ్యక్తిగతంగా ఘాటు విమర్శలు.. సంచలన ఆరోపణలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తాజాగా తన మాటల కత్తికి మరింత పదును పెట్టారు. సీఎం కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చిన వేళ.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు మంత్రి కేటీఆర్.
ఈ సందర్భంగా ఆయన పలు అంశాల మీద రియాక్టు అయ్యారు. వీటిల్లో కొన్ని సీరియస్ కామెంట్లు ఉన్నాయి. అందులో ఒకటి.. తన ఫోన్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉన్నట్లుగా ఆరోపించారు. తన ఫోన్ లో మాత్రమే కాదు.. తన కేబినెట్ సహచరుడు కిషన్ రెడ్డి ఫోన్ లోనూ పెగాసస్ ఉన్నట్లుగా వ్యాఖ్యానించిన కేటీఆర్.. 'తన మంత్రి మాటల్ని కూడా మోడీ వింటున్నారు. దేశంలో పది వేల మంది ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నట్లుగా ఆరోపించారు.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను కేంద్రం నిఘా వేస్తుందన్నారు. నేతలు.. జర్నలిస్టులు.. ఉన్నతాధికారులు.. పారిశ్రామికవేత్తలు.. ఇలా దాదాపు పది వేల మంది ఫోన్లపై నిఘా ఉందన్నారు. తాను వాడే ఫోన్ లో పెగాసస్ జొప్పించి.. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లుగా పేరర్కొన్నారు. నిస్సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియకపోవచ్చంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేవారు.
ఇంతకూ పెగాసస్ ప్రస్తావనను కేటీఆర్ ఎందుకు తీసుకొచ్చారన్న విషయంలోకి వెళితే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోకి ఇంటిలిజెన్స్ సీఐని ఎలా పంపిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావటం గమనార్హం.
ఎప్పటిలానే ప్రధాని మోడీ మీద ఆయన విరుచుకుపడ్డారు.ఆయన మానసపుత్రిక అయిన మన్ కి బాత్ కార్యక్రమం మీదా సెటైర్లు వేశారు. మోడీ కేవలం ప్రచారానికి పరిమితమయ్యారని.. ఆయన దేశ చరిత్రలోనే అత్యంత అసమర్ద.. పనికిరాని ప్రధానిగా అభివర్ణించారు.
మోడీ తన మనసులోని మాట (మన్ కీ బాత్) చెప్పటమే కానీ.. ప్రజల మాట (జన్ కీ బాత్) వినరన్నారు. మోడీ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారని.. నిరుద్యోగం ఆయన హయాంలో బాగా పెరిగిందన్న కేటీఆర్.. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. బీజేపీ వైఫల్యాలపై నిలదీస్తామని.. ఆ పార్టీని బట్టలు విప్పి నగ్నంగా నడి వీధిలో నిలుచోబెడతామని వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.