Begin typing your search above and press return to search.
కేటీఆర్ ... ఏం చెప్పాడు లే!
By: Tupaki Desk | 21 April 2018 8:18 AM GMTదుర్వినియోగం అనే పదానికి పీక్స్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు ఒక నెటిజన్. సాధారణంగా కేటీఆర్ కు ట్విట్టరులో ఎవరైనా న్యాయమైన విన్నపం చేస్తే దాన్ని గమనించి తగు విధంగా స్పందిస్తుంటారు. ఇప్పటివరకు చాలా మంది చాలా రకాలుగా కేటీఆర్ కు ఆన్ లైన్లో రిక్వెస్టులు పెట్టారు. వాటిలో చాలావరకు కేటీఆర్ స్పందించారు. ఒక డాక్టరు తన ఇంటి వద్ద ఉన్న చెత్త గురించి చెప్పింది - మరో వ్యక్తి తన పాప ఆపరేషన్ గురించి చెప్పాడు, మరో వికలాంగుడు తనకు ఇల్లు కావాలని చెప్పాడు. ఇలా అడిగిన వాటికి కేటీఆర్ స్పందిస్తున్నాడు కదా అని... ఓ నెటిజన్ మరీ అన్యాయమైన కోరిక కోరాడు.
సోషల్ మీడియా పుణ్యమా అని పాలకులకు-ప్రజలకు మధ్య అంతరం పోయింది. డిమాండ్ లో న్యాయముంటే డైరెక్టుగా చెప్పుకునే అవకాశం దక్కింది. అయితే, దీనిని అవకాశంగా తీసుకున్న ఒక నెటిజన్ కేటీఆర్ ను ఏకంగా *ఐపీఎల్ టిక్కెట్లు ఇప్పిస్తారా? సార్* అని రిక్వెస్ట్ పెట్టాడు. ఇలాంటి రిక్వెస్టులు దాదాపు ఎవరూ చేయరు. కానీ... ఓ క్రికెట్ వీరాభిమాని ఇలా అడిగేసరికి దానిని కేటీఆర్ చూసిచూడనట్లు వదిలేయలేదు. ఇలాంటి చెత్తకు నేను స్పందించను భవిష్యత్తులో గుర్తుంచుకోండి అని అందరికీ తెలియజెప్పాలని అనుకున్నారో ఏమో... అతని రిక్వెస్టును రీట్వీటు చేస్తూ *నా వల్ల కాదు బాబు * అని ఒక దండం పెట్టాడు. నిజానికి దీనిని రీట్వీట్ చేసి కేటీఆర్ మంచి పనే చేశారని చెప్పాలి.
ఇక కేటీఆర్ ట్వీట్ కు రకరకాల స్పందనలు వచ్చాయి. మీలో మంచి ఫన్నీ యాంగిల్ ఉంది సార్ అని ఒకరంటే.., ఇంకా నయం టీంలో ప్లేస్ అడగలేదు అని మరొకరన్నారు. ఇంకో వ్యక్తి మీ వల్ల కానిది తెలంగాణలో ఉందా? అని సెటైరిక్ రిప్లయి ఇచ్చారు. కేటీఆర్ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వగలడు గాని, ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వలేడు. లలిత్‌మోడీని అడగండి అంటూ మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. కేటీఆర్... యు ఆర్ నాటీ! అంటూ మరొకరు స్పందించారు. మొత్తానికి కేటీఆర్ తెలంగాణ నెటిజన్ల మనసులను బాగానే దోచుకుంటున్నాడని చెప్పాలి. వీకెండ్ కదా తను కూడా సరదాగా తీసుకుని ఉంటాడు.!