Begin typing your search above and press return to search.

అర్ధ రాత్రి రోడ్డు మీద కేటీఆర్‌ కాన్వాయ్ ఆపేసి..

By:  Tupaki Desk   |   14 April 2017 5:31 AM GMT
అర్ధ రాత్రి రోడ్డు మీద కేటీఆర్‌ కాన్వాయ్ ఆపేసి..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరు అభినందించేలా ఒక ప‌ని చేశారు. పొద్దున నుంచి అధికారిక కార్య‌క్ర‌మాల్లో ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా ఉండి తిరుగు ప్ర‌యాణ‌మైతే.. కంటి మీద‌కు కునుకు వ‌చ్చేయ‌టం ఖాయం. అదే ఇక‌.. అర్ద రాత్రి వేళ‌లో అంటే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. తాను ఆ టైంలో కూడా ఎంత చురుగ్గా ఉంటాన‌న్న విష‌యాన్ని చాటి చెప్ప‌ట‌మే కాదు.. ఆగి మ‌రీ సాయం చేసిన తీరుఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

గురువారం అర్ద రాత్రి హైద‌రాబాద్ లోని తిరుమ‌లగిరి ఆర్టీఏ కార్యాల‌యం వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్ లోని లాలా పేట‌కు చెందిన 37 ఏళ్ల ఎండీ అజార్ త‌న భార్య బేగం.. ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఒక శుభ‌కార్యానికి హాజ‌రై ఇంటికి వెళుతున్నారు.

వారి టూవీల‌ర్ ఆర్టీఏ కార్యాల‌యం వ‌ద్ద మ‌లుపు తీసుకునే స‌మ‌యంలో వేగంగా వ‌చ్చిన జీహెచ్ ఎంసీ చెత్త వాహ‌నం వారి వాహ‌నాన్ని ఢీ కొట్టింది. దీంతో.. న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలోనే మంత్రి కేటీఆర్ త‌న ఆర్మూరు ప‌ర్య‌ట‌న ముగించుకొని ఇంటికివెళుతున్నారు.

ప్రమాద స్థలిలో ఆ దృశ్యాలను చూసి త‌న కాన్వాయ్ ను నిలిపేసిన మంత్రి కేటీఆర్‌.. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రిని త‌న కాన్వాయ్ వాహ‌నాల్లో ఆసుప‌త్రికి త‌ర‌లించే ఏర్పాటు చేశారు. అర్ధ రాత్రి వేళ‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న విష‌యంలో కేటీఆర్ స్పందించిన తీరు అక్క‌డి వారిని ఇంప్రెస్ చేసింది. ఈ ఎపిసోడ్‌ లో కేటీఆర్‌ ను అభినందిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/