Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు సభలో షాకిచ్చిన కవిత

By:  Tupaki Desk   |   1 Aug 2018 8:44 AM GMT
కేటీఆర్ కు సభలో షాకిచ్చిన కవిత
X
సీఎం కేసీఆర్ వారసులుగా తెలంగాణ ప్రభుత్వ పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్ - కవితలు.. మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక కవిత.. నిజామాబాద్ ఎంపీగా ఢిల్లీలో పనులన్నీ చక్కదిద్దుతున్నారు. తాజాగా ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు నిజామాబాద్ లో ఐటీ హబ్ కు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభలో ఆసక్తికర కామెంట్లతో అందరినీ ఆకర్షించారు .

ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్ కే పరిమితమైందని.. ఇప్పుడు అన్ని జిల్లాలకు ఐటీ విస్తరిస్తున్నారని అన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు.

అయితే ఈ సందర్భంగా తన అన్నయ్య కేటీఆర్ ను అభివృద్ధిలో పక్షపాతం చూపవద్దంటూ ఇరికించారు. అన్నయ్య కేటీఆర్ దృష్టి ఎప్పుడూ తన ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంటుందని.. జర ఆ ప్రేమను చెల్లెలు ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ పైనా చూడాలని సభాముఖంగా కోరుతున్నానని విన్నవించింది. ఇలా బహిరంగ సభలో అభివృద్ధి విషయంలో అన్నయ్య కేటీఆర్ పక్షపాతం చూపిస్తాన్నడని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అభివృద్ధి గురించే ఈ కోరిక కోరడంతో అందరూ కవిత సమయస్ఫూర్తితో కేటీఆర్ ను ఇరికించిందని వ్యాఖ్యానించారు.



వీడియో కోసం క్లిక్ చేయండి