Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా.. సిటీ కోర్టు విచారణలో ట్విస్ట్

By:  Tupaki Desk   |   21 Sep 2021 3:30 PM GMT
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా.. సిటీ కోర్టు విచారణలో ట్విస్ట్
X
తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. తనపై రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్.. తాజాగా సిటీ సివిల్ కోర్టులో రీ పిటీషన్ దాఖలు చేశారు. నిన్న కేవలం పరువు నష్టం దావా మాత్రమే వేసిన కేటీఆర్ ఇవాళ కోటి రూపాయలకు రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసు వేశాడు. సోమవారం వేసిన పిటీషన్ కు సాక్ష్యాలను జతచేసి రీ సబ్మిట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఇక ఇంటర్నెట్ , వెబ్ సైట్, సోషల్ మీడియా, టీవీ చానెల్స్ లో తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని మంత్రి కేటీఆర్ కోర్టును కోరారు. తనపై రేవంత్ రెడ్డి చేసే అసభ్యకరమైన , తన ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలను వార్తా చానళ్లు, ఇతర మీడియా ప్రసార సాధానాలు ప్రసారం చేయకుండా నియంత్రించాలని కోర్టును మంత్రి కోరారు.

కొంతకాలంగా మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సినీతారలతో సంబంధాలు, డ్రగ్స్ కేసులో ఆయనకు ప్రమేయం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పరుష వ్యాఖ్యలతో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న మంత్రి కేటీఆర్.. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాటలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే కోర్టుకు ఎక్కి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు వేశారు. కేటీఆర్ వేసిన దావా పిటీషన్ పై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. పరువు నష్టం దావాలో ఇంజెక్షన్ ఆర్డర్ పై వాదనలు ముగిశాయి. దీనిపై మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.