Begin typing your search above and press return to search.
సోము వీర్రాజు లిక్కర్ ఆఫర్ పై మంత్రి కేటీఆర్ సెటైర్
By: Tupaki Desk | 29 Dec 2021 11:30 AM GMTఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు బీజేపీని ఇరుకునపెట్టాయి. బీజేపీని ఏపీలో తాగుతున్న కోటి మంది ఓట్లేసి గెలిపిస్తే రూ.50కే చీప్ లిక్కర్ ఇస్తామని సోమువీర్రాజు సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్.. బీజేపీని ఉతికి ఆరేశారు. బీజేపీ గాలితీసేశారు.
ఏపీలో నిన్న బీజేపీ జనాగ్రహ సభ నిర్వహించారు. అయితే సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.75కే ఇస్తామని పేర్కొన్నారు. వీలైతే రూ.50కే ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతోందని ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి రూ.12వేలు రాబట్టి వాటినే వారి అకౌంట్లో వేస్తోందన్నారు.
రాష్ట్రంలో మద్యం తాగే కోటి మంది బీజేపీకి ఓటేసి గెలిపించాని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీలోని వైసీపీ, టీడీపీ నేతలు సైతం సోము వీర్రాజు మాటలపై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఈ సందర్భాన్ని వాడుకొని బీజేపీని టార్గెట్ చేశారు.
తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో కేటీఆర్ పోస్టు చేశారు. దీనికి ‘వాహ్.. ఏం పథకం.. చీప్ లిక్కర్ ను రూ.50కే సరఫరా చేయాలనే బీజేపీ జాతీయపథకం బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా?’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యేలా సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.