Begin typing your search above and press return to search.

ప‌రున వెళ్లి మ‌రీ స్వీటీకి కేటీఆర్ షేక్ హ్యాండ్‌!

By:  Tupaki Desk   |   5 April 2018 4:13 AM GMT
ప‌రున వెళ్లి మ‌రీ స్వీటీకి కేటీఆర్ షేక్ హ్యాండ్‌!
X
స్వీటీ అన్నంత‌నే మీకు గుర్తుకు వ‌చ్చే వాళ్ల‌నుకుంటే మాత్రం త‌ప్పులో కాలేసిన‌ట్లే. మాట‌ల్లో.. చేత‌ల్లో ఎలాంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. మీరు అనుకునే స్వీటీ షేక్ హ్యాండ్ కోసం హ‌డావుడి ప‌డే ఛాన్సే లేదు. ఇంత‌కీ.. ఈ కొత్త స్వీటీ ఎవ‌రు? కేటీఆర్ కు అంత‌లా ఆక‌ర్షించిన స్వీటీ ప్ర‌త్యేక ఏమిటి? అన్న విష‌యంలోకి వెళితే..

మంత్రి కేటీఆర్ సోమ‌వారం వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పోలీసు జాగిలం స్వీటీకి క‌నిపించినంత‌నే దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కుడా కార్యాల‌యంలో జ‌రిగిన జిల్లా అభివృద్ధిపై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించిన మంత్రి కేటీఆర్‌.. బ‌య‌ట‌కు వెళ్లే వేళ‌లో పోలీసు జాగిలం స్వీటీ త‌న‌కు షేక్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న దృశ్యాన్ని చూశారు.

అంతే.. ప‌రుగున దాని ద‌గ్గ‌ర‌కు వెళ్లిన కేటీఆర్.. స్వీటీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా క్లిక్ మ‌నిపించిన ఫోటోను ట్విట్ట‌ర్ ఖాతాలో త‌న ఫేవ‌రేట్ పిక్ గా పెట్టుకున్నారు. త‌న బిజీలో తాను ఉన్నా.. చుట్టూ ప‌రిస్థితుల్ని ఒక కంట క‌నిపెడ‌తార‌న్న విష‌యాన్ని తాజా ఉదంతంలో కేటీఆర్ చెప్ప‌క‌నే చెప్పార‌ని చెప్పాలి.