Begin typing your search above and press return to search.

కేటీఆర్.. ఇంత ధీమాగా అన్నాడేంటి.?

By:  Tupaki Desk   |   22 Sep 2018 12:05 PM GMT
కేటీఆర్.. ఇంత ధీమాగా అన్నాడేంటి.?
X
కేసీఆర్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో నంబర్ 2 కేటీఆరే.. అన్నింట్లో అన్నీ తానై నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అధికారంలోకి రాకముందు ఉద్యమకాలంలో టీఆర్ ఎస్ లో హరీష్ నంబర్ 2గా ఉంటే ఇప్పుడు మొత్తం కేటీఆర్ అయిపోయాడు. అలాంటి కేటీఆర్ తన పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరకుండా.. పని బాగా చేస్తే విపక్షాలను గెలిపించాలని కోరడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.

తనపై పోటీకి నిలబడే అభ్యర్థులు తన కంటే బాగా పనిచేస్తే వారినే గెలిపించాలని మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్ల ప్రజలను కోరారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. బాగా పనిచేస్తే ధైర్యంగా విపక్షానికి ఓటేయొచ్చు అని కామెంట్ చేశారు. ఇలా విపక్షానికి ఓటేయవచ్చు అని మంత్రి కేటీఆర్ అనడంతో వేదిక మీద ఉన్న నాయకులంతా ఆశ్చర్యపోయారు. విపక్ష అభ్యర్థుల కంటే బాగా పనిచేస్తానని నమ్మితేనే గెలిపించాలని కేటీఆర్ కోరడం సంచలనంగా మారింది.

తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట సిరిసిల్లలో పోటీచేసినప్పుడు కేవలం 171 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచానని కేటీఆర్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 10 నెలలకే ఉద్యమం కోసం రాజీనామా చేస్తే 68000 ఓట్ల మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఇలా ప్రజల కోసం చేస్తే ఖచ్చితంగా గెలిపిస్తారని.. అందుకే బాగా పనిచేసిన వాళ్లనే గెలిపించాలని తాజాగా కామెంట్ చేశారు.